News September 29, 2024
అరకులో పాస్ పోర్టు ఆఫీస్..!

అరకులోయలో పాస్ పోర్టు ఆఫీస్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తపాలా శాఖ డివిజనల్ సూపరింటెండెంట్ సంజయ్ పాండా తెలిపారు. శనివారం ఆయన అరకులోయలోని ఉప తపాలా శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు పాస్ పోర్టు సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాల్లో ఉప తపాలా కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు.
Similar News
News January 4, 2026
విశాఖ: ప్రభుత్వ కార్యాలయాలలో రేపు పీజీఆర్ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 4, 2026
రేపు విశాఖ పోలీస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

ప్రజల సమస్యల పరిష్కారం కోసం విశాఖ సిటీ పోలీస్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తోంది. సీపీ శంఖబ్రత బాగ్చీ ఆదేశాల మేరకు జనవరి 5న ఉదయం 10 గంటల నుంచి ఆర్ముడ్ రిజర్వ్ ఆఫీస్లోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. బాధితులు నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడమే తమ ప్రాధాన్యత అని సీపీ స్పష్టం చేశారు.
News January 4, 2026
గాజువాక లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య.. పక్కనే ‘సూసైడ్ నోట్’

గాజువాకలోని ఓ లాడ్జిలో మోహన్ రాజు అనే వ్యక్తి శనివారం రాత్రి <<18758829>>ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. లాడ్జి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఈరోజు ఉదయం ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులకు సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో ‘షేర్ మార్కెట్ నా జీవితాన్ని నాశనం చేసింది. నువ్వు చెప్పినా వినకొండ పెట్టుబడి పెట్టి నష్టపోయాను. అశ్విని నీకేమీ చేయలేకపోయాను తల్లి. ఎవరినీ సహాయం అడగాలనిపించలేదు’ అంటూ 7 పేజీల నోట్ రాసి ఉంది.


