News July 21, 2024

అరకులో రైల్వే ట్రాక్‌పై కూలిన చెట్టు

image

అల్లూరి జిల్లా అరకులోయ కేకే లైన్‌లో బొర్రా గృహలు, కరకవలస స్టేషన్‌ల మధ్య రైల్వే ట్రాక్‌పై భారీ వృక్షం కూలి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి బొర్రా స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై చెట్టు కూలింది. దీంతో అరకు మీదుగా వెళ్ళే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెట్టును తొలగించేందుకు రైల్వే శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Similar News

News December 1, 2025

విశాఖ: ఆర్కే బీచ్‌లో ప్రమాద హెచ్చరిక బోర్డుల ఏర్పాటు

image

ఆర్కే బీచ్‌కు వచ్చే పర్యాటకుల భద్రత దృష్ట్యా నగర పోలీసులు చర్యలు చేపట్టారు. త్రీ టౌన్ సీఐ పైడయ్య ఆధ్వర్యంలో బీచ్‌లోని ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. “ఇచ్చట స్నానం చేయడం ప్రమాదకరం” అని హెచ్చరిస్తూ, అత్యవసర సహాయం కోసం సీఐ, టోల్ ఫ్రీ నంబర్లను (1093, 112) పొందుపరిచారు. పర్యాటకులు సముద్రంలో లోతుగా వెళ్లవద్దని పోలీసులు సూచించారు.

News December 1, 2025

విశాఖ జిల్లాలోని స్కూళ్లలో పిల్లలకు ఉదయం స్నాక్స్

image

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారంలో మూడు రోజుల మార్నింగ్ న్యూట్రిషన్ అందించేందుకు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అక్షయపాత్ర సహకారంతో కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. తొలి విడతగా 178 పాఠశాలల్లో ప్రారంభించి, త్వరలో అన్ని పాఠశాలలకు విస్తరించనున్నారు. ఉదయం అల్పాహారం లేక తరగతులకు వచ్చే పిల్లలకు చిరుతిండ్లు వంటివి అందించనున్నారు.

News December 1, 2025

అర్జీలు రీ-ఓపెన్ కాకూడదు: అధికారులకు కలెక్టర్ ఆదేశం

image

విశాఖ కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పీజీఆర్ఎస్ నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా 237 వినతులు స్వీకరించారు. ఒకే సమస్యపై అర్జీలు మళ్లీ ‘రీ-ఓపెన్’ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారులతో తప్పనిసరిగా ఫోన్లో మాట్లాడాలని సూచించారు. వచ్చిన వినతుల్లో రెవెన్యూ, జీవీఎంసీ సమస్యలే ఎక్కువగా ఉన్నాయని, వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.