News October 15, 2024

అరకు: ఈనెల 16వ తేదీన ఎంపికలు-డీఈవో

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా ఆర్చరీ అండర్-14, 17 విభాగం బాలుర, బాలికల ఎంపికలను ఈనెల 16న అరకులోయలోని ఏపీ టీడబ్ల్యూఆర్ స్పోర్ట్స్ స్కూల్లో నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖాధికారి పీ.బ్రహ్మాజీరావు తెలిపారు. ఈ ఎంపికలను హాజరయ్యే విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఎలిజిబులిటీ ఫామ్, మిడ్డే మీల్స్ ఎక్విటెన్స్ తీసుకురావాలని సూచించారు.

Similar News

News December 11, 2025

విశాఖ వేదికగా పెన్షన్ అదాలత్

image

విశాఖపట్నంలో డిసెంబర్ 19న ‘పెన్షన్ అదాలత్’ కార్యక్రమం జరగనుంది. సిరిపురం వుడా చిల్డ్రన్స్ థియేటర్‌లో జరిగే ఈ సదస్సుకు ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శ్రీమతి ఎస్.శాంతి ప్రియ హాజరవుతారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారం, డీడీవోలకు సరైన మార్గనిర్దేశం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఉద్యోగులు, పెన్షనర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

News December 11, 2025

సింహాచలంలో నెల గంట ముహూర్తం ఎప్పుడంటే ?

image

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి సన్నిధిలో నెలగంట ఉత్సవాన్ని ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం 1:01 గంటకు శాస్త్రోక్తంగా ప్రారంభించనున్నట్లు ఆలయ వైదిక సభ్యులు తెలిపారు. ఈ ధనుర్మాసంలో ఆలయంలో 10 రోజులు పగల్ పత్తు, మరో 10 రోజులు రాపత్తు ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. మరో ఐదు రోజులు దారోత్సవాలు, ధనుర్మాసం సందర్భంగా నెలరోజులు తిరుప్పావై పాశురాల పఠనం నిర్వహిస్తారు.

News December 11, 2025

విశాఖకు గూగుల్.. శంకుస్థాపన ఎప్పుడంటే?

image

విశాఖ ప్రజలకు మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. మార్చిలో గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. మరోవైపు విశాఖలోని ఐటీ హిల్స్‌పై 7ఐటీ కంపెనీలకు శుక్రవారం భూమిపూజ జరగనుంది. ఉదయం 11.30 గంటలకు నిర్వహించే కాగ్నిజెంట్ పూజలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ మేరకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఏర్పాట్లు చేస్తున్నారు.