News April 14, 2025
అరకు: ఈ నెల 15న పీఎం నేషనల్ అప్రెంటీస్ షిప్ మేళా

అరకులోయ ఆర్ఐటీఐ కళాశాలలో ఈ నెల 15న పీఎం నేషనల్ అప్రెంటీస్ షిప్ మేళా జరుపుతున్నట్లు ప్రిన్సిపల్ వేంకటేశ్వర రావు తెలిపారు. జాబ్ మేళాలో పలు స్టార్ హోటల్స్, ఫార్మా, కెమికల్, ఐటీ కంపెనీలు పాల్గొని తమ ఖాళీలను భర్తీ చేస్తాయని అన్నారు. ఎలక్ట్రికల్, ఫిట్టర్, వెల్డర్, ప్లంబర్, R&AC ట్రేడులు పాసైనవారు పాల్గొనాలన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లు, 2 పాస్ ఫొటోలు, జిరాక్స్లతో రావాలని పేర్కొన్నారు.
Similar News
News December 2, 2025
హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలు

హైదరాబాద్ <
News December 2, 2025
దిత్వా తుఫాన్.. ఈ జిల్లాలకు వర్ష సూచన

AP: బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
News December 2, 2025
థియేటర్లలో రొమాన్స్.. టెలిగ్రామ్లో వీడియోలు

థియేటర్లలో జంటలు సన్నిహితంగా ఉండే వీడియోలు టెలిగ్రామ్, Xలో దర్శనమివ్వడం కేరళలో కలకలం రేపింది. అక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే థియేటర్లలో CCTV ఫుటేజీలు హ్యాక్ అయ్యాయి. సరైన సెక్యూరిటీ నెట్వర్క్ వ్యవస్థ లేకపోవడంతో ఈజీగా హ్యాక్ అయినట్లు నిపుణులు తెలిపారు. స్ట్రాంగ్ పాస్ వర్డ్స్, బలమైన నెట్వర్క్, సరైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. థియేటర్లలో సన్నిహితంగా ఉండొద్దని చెబుతున్నారు.


