News March 24, 2024
అరకు ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత

TDP-జనసేన-BJP ఉమ్మడి అభ్యర్థిగా అరకు ఎంపీ స్థానానికి కొత్తపల్లి గీతను BJP అధిష్ఠానం ఖరారు చేసింది. 2014లో లోక్సభ ఎన్నికల్లో వైసీపీ తరఫున అరకు ఎంపీగా కొత్తపల్లి గీత గెలిచింది. తరువాత వైసీపీని వీడి బీజేపీలో చేరారు. అదే సందర్భంలో ఆమెపై పలు అవినీతి ఆరోపణలు రాగా.. కోర్టులో సదరు అభియోగాలపై గీతకు అనుకూలంగా తీర్పు వచ్చింది. వైసీపీ తరఫున అరకు ఎంపీ అభ్యర్థిగా చెట్టి తనూజ రాణి బరిలో ఉన్నారు.
Similar News
News December 10, 2025
విశాఖలో టెట్ పరీక్షకు తొలిరోజు 91.05% హాజరు

విశాఖలో బుధవారం జరిగిన టెట్ పరీక్షకు మొత్తం 2001 మంది అభ్యర్థులకు గానూ 1822 మంది (91.05%) హాజరయ్యారు. పరీక్షల సరళిని డీఈవో స్వయంగా 2 కేంద్రాల్లో తనిఖీ చేయగా.. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం 5 కేంద్రాలను సందర్శించి పరిశీలించింది. ఉదయం 5 కేంద్రాల్లో, మధ్యాహ్నం ఒక కేంద్రంలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు.
News December 10, 2025
ఎండాడ జాతీయ రహదారిపై బస్సు ఢీకొని జింక మృతి

ఎండాడ జాతీయ రహదారిపై బస్సు ఢీకొని జింక మృతి చెందింది. కంబాలకొండ నుంచి జింకలు తరచుగా రోడ్డుపైకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం జింక రోడ్డుపైకి ఆకస్మికంగా రావడంతో, అటుగా వస్తున్న బస్సు ఢీకొంది. జింక అక్కడికక్కడే మృతి చెందింది. కంబాలకొండ అడవి నుంచి ఇలా రోడ్డెక్కిన జింకలు తరచుగా ప్రమాదాలకు గురై, తీవ్ర గాయాలు లేదా మరణం సంభవిస్తున్నాయి. మృతదేహాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
News December 10, 2025
విశాఖలో నేటి నుంచి ఎక్కడికక్కడ పనులు బంద్

జీవీఎంసీ పరిధిలో కాంట్రాక్టర్లు బుధవారం నుంచి పనులు నిలిపివేయడానికి నిర్ణయం తీసుకున్నారు.18 నెలలు నుంచి కాంట్రాక్టర్లకు రూ.400 కోట్ల బకాయిలు ఉండగా బిల్లులు చెల్లించాలని పలు దఫాలుగా వినతులు ఇచ్చారు. మంగళవారం కమిషనర్కు నోటీసులు కూడా అందజేశారు. స్పందించకపోవడంతో నేటి నుంచి యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లోనూ కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారు.


