News August 13, 2024

అరకు ఎంపీ ఎన్నికను రద్దు చేయాలని హైకోర్టులో సవాల్

image

అరకు ఎంపీ తనూజా రాణి ఎన్నికను రద్దు చేయాలని బీజేపీ అభ్యర్థి గీత హైకోర్టును ఆశ్రయించారు. ఆమె ఎన్నికల అఫిడవిట్‌లో అవాస్తవాలు చూపారని ఆరోపించారు. ఓట్ల పరంగా రెండో స్థానంలో ఉన్న తనను ఎన్నికైనట్లు ప్రకటించాలన్నారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు తనూజాతో పాటు పదిమంది అభ్యర్థులకు, లోక్ సభ సెక్రటరీ జనరల్, అరకు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేసింది.విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది.

Similar News

News December 16, 2025

విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా చోడే పట్టాభిరామ్?

image

విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా చోడే పట్టాభి రామ్‌‌కు పార్టీ అధిష్ఠానం అవకాశం కల్పించినట్లు సమాచారం. పట్టాభి 8వ వార్డులో మాజీ కార్పొరేటర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆయన టీటీడీ బోర్డు లోకల్ అడ్వైజర్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.

News December 16, 2025

‘సంక్రాంతికి విశాఖ-హైదరాబాద్ ప్రత్యేక రైళ్లు నడపండి’

image

సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా విశాఖపట్నం – హైదరాబాద్ మధ్య తక్షణమే ప్రత్యేక రైళ్లు నడపాలని బీజేపీ రాష్ట్ర విధాన పరిశోధన విభాగ సభ్యుడు డాక్టర్ కె.వి.వి.వి.సత్యనారాయణ వాల్తేరు డీఆర్‌ఎంను కోరారు. ప్రస్తుతం రైళ్లన్నీ ‘రిగ్రెట్’ (Regret) స్థితిలో ఉన్నాయని, ప్రయాణికుల సౌకర్యార్థం భోగికి వారం ముందు, కనుమ తర్వాత అదనపు రైళ్లు, కోచ్‌లు ఏర్పాటు చేయాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.

News December 16, 2025

విశాఖ: సముద్రంలో మత్స్యకారుడు గల్లంతు

image

పూసపాటిరేగకు చెందిన వాసుపల్లి రాములు (55) సముద్రంలో గల్లంతయ్యాడు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి శుక్రవారం బోటులో వేటకు వెళ్లాడు. ఆదివారం రాత్రి తీరానికి 70 మైళ్ల దూరంలో ఆయన ప్రమాదవశాత్తు బోటుపై నుంచి సముద్రంలో జారిపడ్డాడు. సహచర సిబ్బంది గాలించినా ఆచూకీ లభించలేదని, మంగళవారం సాయంత్రం ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసినట్లు పోర్ట్ సీఐ రమేశ్ తెలిపారు.