News August 13, 2024

అరకు ఎంపీ ఎన్నికను రద్దు చేయాలని హైకోర్టులో సవాల్

image

అరకు ఎంపీ తనూజా రాణి ఎన్నికను రద్దు చేయాలని బీజేపీ అభ్యర్థి గీత హైకోర్టును ఆశ్రయించారు. ఆమె ఎన్నికల అఫిడవిట్‌లో అవాస్తవాలు చూపారని ఆరోపించారు. ఓట్ల పరంగా రెండో స్థానంలో ఉన్న తనను ఎన్నికైనట్లు ప్రకటించాలన్నారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు తనూజాతో పాటు పదిమంది అభ్యర్థులకు, లోక్ సభ సెక్రటరీ జనరల్, అరకు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేసింది.విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది.

Similar News

News November 28, 2025

రోడ్డు ప్రమాద బాధితులకి నగదు రహిత వైద్యం: VZM కలెక్టర్

image

రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం అందించిన నగదు రహిత వైద్య సదుపాయం పై శుక్రవారం రాత్రి దేశ వ్యాప్త వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్‌లో విజయనగరం జిల్లా నుంచి కలెక్టర్ రాం సుందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు పొందవచ్చని MORDH అధికారులు వివరించారు.

News November 28, 2025

పొక్సో కేసులో వ్యక్తికి మూడేళ్ల జైలు: VZM SP

image

విజయనగరానికి చెందిన వి.రవి (49)పై 2025లో నమోదైన పోక్సో కేసులో 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ తెలిపారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై మహిళా పోలీస్ స్టేషన్ పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి కోర్టులో ఆధారాలు సమర్పించడంతో శిక్ష పడిందన్నారు. బాధితురాలికి రూ.50 వేల పరిహారం మంజూరు చేసినట్లు స్పెషల్ పోక్సో కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.

News November 28, 2025

సదరం రీ-అసెస్‌మెంట్ జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం

image

విజయనగరం జిల్లాలో NTR భరోసా పింఛన్ రీ-అసెస్‌మెంట్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సదరం రీ-అసెస్‌మెంట్ కార్యక్రమంపై ఆయన శుక్రవారం తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రీ-అసెస్‌మెంట్‌లో జాప్యం జరుగుతుండటం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.