News January 10, 2025

అరకు: ‘గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా చలి అరకు ఉత్సవం’

image

గిరిజన సంస్కృతి, ఆచార సంప్రదాయాలు ప్రతిబింబించేలా చలి అరకు ఉత్సవం నిర్వహించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. చలి అరకు ఉత్సవంపై గురువారం సమావేశమయ్యారు. సాంస్కృతిక ప్రదర్శనకు అవసరమైన కళాకారుల వివరాలు సేకరించి రవాణా, వసతి సౌకర్యాలు సమకూర్చాలని చెప్పారు. ప్రతీ రోజు నిర్వహించవలసిన కార్యక్రమాలపై చర్చించారు. ఫుడ్ కోర్టులు, ఎమ్యూజ్మెంట్, పార్కింగ్, స్టాల్స్ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.

Similar News

News July 11, 2025

విశాఖలో మెట్రోకు సెప్టెంబర్‌లో శంకుస్థాపన: గండి బాబ్జి

image

విశాఖలో మెట్రోకు సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేపట్టనున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి వెల్లడించారు. శుక్రవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఉమ్మడి విశాఖలోని సుమారు 300 గ్రామాల్లో గంజాయి సాగును నిర్మూలించి ఉద్యానవనాల పెంపునకు కృషి చేస్తున్నామన్నారు.

News July 11, 2025

విశాఖలో ఈసాయ్ సంస్థ విస్తరణ

image

విశాఖపట్నంలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఈసాయ్ ఫార్మాస్యూటికల్స్ నిర్ణయించింది. 2026 ఫిబ్రవరి నాటికి ఈ కేంద్రం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇప్పటికే జేఎన్ ఫార్మా సిటీలో తయారీ ప్లాంట్‌ను నిర్వహిస్తున్న ఈసాయ్ సంస్థ ఈ కొత్త కేంద్రంతో భారత్‌లో తన ఉనికిని మరింతగా బలోపేతం చేయనుంది.

News July 11, 2025

షీలానగర్‌లో యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

షీలానగర్ సమీపంలోని మారుతి సర్కిల్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పరవాడకు చెందిన అశోక్ రెడ్డి బైకుపై వెళుతుండగా ట్రాలర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎయిర్ పోర్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గతంలో కూడా ఇదే ఏరియాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు.