News February 21, 2025

అరకు: సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు పాటించాలి

image

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్, ఎక్స్(ట్విట్టర్), ఇతర సోషల్‌ మీడియా వేదికగా ఇతరులను కించపరిచేలా అసభ్యకరమైన పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని అరకు CI హిమగిరి హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన జారీ చేశారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. వ్యక్తుల, సంస్థలపై అసత్య ప్రచారాలు, అవమానకరమైన ఫొటోలు, వీడియోలు పెడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు.

Similar News

News November 4, 2025

గోళ్లు విరిగిపోతున్నాయా?

image

గోళ్లు కాస్త పెరగ్గానే పొడిబారి, పెళుసుగా మారి విరిగిపోవడానికి అవి తేమను కోల్పోవడం ఒక కారణం అంటున్నారు నిపుణులు. కాబట్టి నెయిల్స్​కు తగినంత తేమను అందించడం చాలా ముఖ్యమంటున్నారు. ఇందుకోసం తగినంత వాటర్ తాగాలి. మాయిశ్చరైజర్​ను గోరు మొదలు(క్యుటికల్) చుట్టూ పూసి, చేతులకు కాటన్ గ్లౌజుల్ని ధరించాలి. విటమిన్ ఈ, ఆలివ్ ఆయిల్ రాయడం వల్ల కూడా నెయిల్స్ తిరిగి తేమను పొందుతాయంటున్నారు.

News November 4, 2025

పురుగు మందుల పిచికారీ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

☛ పురుగు మందుల పిచికారీకి అవసరాన్ని బట్టి తగిన స్ప్రేయర్, నాజిల్స్ ఎన్నుకోవాలి. ☛ ద్రావణం తయారీకి మంచినీరే వాడాలి. సిఫార్సు చేసిన మోతాదునే పిచికారీ చేయాలి. తక్కువ వాడితే మందు పనిచేయదు. ఎక్కువ వాడితే పురుగు రోగనిరోధక శక్తిని పెంచుకుంటుంది. ☛ ఎండ తీవ్రత, గాలివేగం ఎక్కువగా ఉన్నప్పుడు, మంచు కమ్మినప్పుడు, వర్షం కురిసే ముందు పిచికారీ చేయరాదు. ☛ జలాశయాలు, చెరువులు, నీరుండే చోటు దగ్గరలో మందు కలపకూడదు.

News November 4, 2025

జానంపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మూసాపేట మండలం జానంపేటలో 28.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. చిన్నచింతకుంట 19.5, మిడ్జిల్ 11.3, కౌకుంట్ల 18.8, దేవరకద్ర 17.0, మహబూబ్‌నగర్ గ్రామీణ 9.8, అడ్డాకుల 8.5, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 5.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.