News November 8, 2024
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు: అంబటి

కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారనే ఆరోపణలపై YCP సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు అయిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అరెస్టులును సాగించి సోషల్ మీడియాని అడ్డలేరు’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో పాటు తాము నిజంవైపు నిలబడి ఉంటామంటూ ఓ ఫొటోను షేర్ చేశారు.
Similar News
News December 1, 2025
గుంటూరు: PGRS సద్వినియోగానికి కలెక్టర్ పిలుపు

మీకోసం వెబ్ సైట్‌తో పాటూ నేరుగా PGRS అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో PGRS కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. సమర్పించిన అర్జీల వివరాలను 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. కలెక్టరేట్, అన్ని కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

News November 30, 2025
GNT: దిత్వా తుఫాన్.. కంట్రోల్ రూమ్ నంబర్లివే.!

గుంటూరు జిల్లాలో దిత్వా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలపై జిల్లా, సబ్డివిజన్ల వారీగా కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు.
ఈస్ట్ సబ్‌డివిజన్-0863-2223
వెస్ట్ సబ్‌డివిజన్-0863-2241152 / 0863-225930
నార్త్ సబ్‌డివిజన్-08645-23709
సౌత్ సబ్‌డివిజన్-0863-232013
తెనాలి సబ్‌డివిజన్-08644-22582
తుళ్లూరు సబ్‌డివిజన్-08645-24326
జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్: 0863-223010.