News February 25, 2026

అరటి తోటల్లో ఇలా చేస్తే అధిక ప్రయోజనం

image

అరటి మొక్కలను నాటిన 6-8 నెలల్లో చెట్టు మొదలుకు మట్టిని ఎగదోస్తే చెట్టుకు బలం పెరుగుతుంది. గాలులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వెదురు గడలు పాతి అరటి చెట్టుకు ఊతం ఇవ్వాలి. గెలలు నరికిన చెట్లను అడుగువరకు నరికేయాలి. గెల వేసి హస్తాలు పూర్తిగా విచ్చుకున్న తర్వాత మగ పువ్వును కోసేయాలి. మగ పువ్వును కోసిన వెంటనే పాలిథీన్ సంచులను గెలలకు తొడిగితే పండ్లు పూర్తిగా ఏ విధమైన మచ్చలు లేకుండా ఆకర్షణీయంగా తయారవుతాయి.

Similar News

News April 13, 2026

ఆంధ్రా కశ్మీర్ అనంత.. మనదగ్గరా యాపిల్ పంట

image

AP: ఎక్కువగా చల్లని ప్రదేశాల్లోనే పండే యాపిల్ పంట ఇప్పుడు రాయలసీమకూ విస్తరించింది. అనంతపురం(D) గార్లదిన్నె, కుందుర్పి, పెద్దపప్పూరు మండలాల్లో రైతులు సాగు చేస్తున్నారు. 15 ఎకరాల్లో తోటలు వేశారు. డిసెంబర్‌లో పూతకు వచ్చిన చెట్లు ఇప్పుడు కాయలు కాసి కోతకొచ్చాయి. ఎకరానికి టన్ను దిగుబడి వచ్చిందని, కిలో ₹120-170 పలుకుతోందని రైతులు చెబుతున్నారు. ‘అనంత యాపిల్’ పేరుతో గిఫ్ట్ ప్యాకులుగానూ విక్రయిస్తున్నారు.

News April 13, 2026

ఇంటర్ ఫలితాలు.. 1000కి 997 మార్కులు

image

TGలో నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలు అదరగొట్టారు. MPCలో సాయి శ్రేష్ఠిత 1000కి 997, BiPCలో కె.జ్యోత్స్న, హఫ్సాబేగం 1000కి 997 చొప్పున స్కోర్ చేశారు. ఇక ఫస్టియర్‌ MPCలో పలువురు విద్యార్థులు 470కి 469 మార్కులు సాధించారు. నేటి నుంచి ఈ నెల 20వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు బోర్డు అవకాశం కల్పించింది. రీకౌంటింగ్‌కు ప్రతి సబ్జెక్టుకు రూ.100 చొప్పున, రీవెరిఫికేషన్‌కు రూ.800 చొప్పున చెల్లించాలి.

News April 13, 2026

పత్తి రైతులకు కేంద్రం శుభవార్త

image

పత్తి రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మార్కెట్లో రేటు తగ్గినా నష్టం కలగకుండా ధర లోటు చెల్లింపు పథకం(PDPS) అమలుకు శ్రీకారం చుడుతోంది. పైలట్ ప్రాజెక్టుగా తెలుగు రాష్ట్రాలను ఎంపిక చేసింది. దీని ప్రకారం కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే మార్కెట్ రేటు తక్కువగా ఉంటే ఆ తేడా మొత్తాన్ని రైతుల అకౌంట్లలో జమ చేయనుంది. ఇది అమల్లోకి వస్తే ధర తగ్గినా రైతులకు నష్టం కలగదు.