News February 24, 2025
అరసవల్లి ఆదిత్యుని ఆదాయం

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయానికి ఆదివారం వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేణా రూ.8,09,600లు, పూజలు, విరాళాల రూపంలో రూ.1,34,906/-లు, ప్రసాదాల రూపంలో రూ.2,51,675/-లు ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
Similar News
News February 24, 2025
శ్రీకాకుళం: వంశధార గొట్ట బ్యారేజ్లో డెడ్ స్టోరేజ్

జిల్లాకు సాగునీరు అందించే వంశధార గొట్ట బ్యారేజ్లో నీరు డెడ్ స్టోరేజ్కు చేరుకుంది. దీంతో సాగునీటీతో పాటు, వంశధార నదీ పరివాహక ప్రాంతాలలో తాగునీటికి ఇక్కట్లు తప్పడం లేదు. ఒడిశాలో వర్షాలు పడితే గాని బ్యారేజ్ నిండే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాది అక్టోబర్ నుంచి వర్షాలు లేకపోవడంతో ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటీవల 130 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం రెండు టీఎంసీల నీరు మాత్రమే ఉంది.
News February 24, 2025
సౌదీ అరేబియాలో శ్రీకాకుళం వాసి మృతి

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం ఎం మరువాడ గ్రామానికి చెందిన కొవిరి రామారావు (37) సౌదీ అరేబియాలో ఆదివారం రాత్రి కడుపు నొప్పితో మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారని సోదరుడు శ్రీనివాసరావు తెలిపారు. 3 నెలల క్రితం సౌదీ అరేబియాకు ఉపాధి నిమిత్తం పనిచేసుకునేందుకు వెళ్లారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News February 24, 2025
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చికెన్ మేళాలు

శ్రీకాకుళం జిల్లాలో చికెన్ మేళాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు పలు ప్రైవేట్ పౌల్ట్రీ సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 24న చిలకపాలెం, పొందూరు, 25న నరసన్నపేట, టెక్కలి, హిరమండలం, 28న పలాస, సోంపేటలో సాయంత్రం 5 గంటల నుంచి చికెన్ మేళా నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కాగా ఆదివారం శ్రీకాకుళం నగరంలో చికెన్ మేళా జరిగింది. చికెన్ మేళాల నిర్వహణపై ఇటీవల రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు.