News February 17, 2025
అరసవల్లి: ఆదిత్యుని నేటి ఆదాయం

శ్రీకాకుళంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేణా రూ.8,15,000/- లు, పూజలు, విరాళాల రూపంలో రూ.1,08,740/-లు, ప్రసాదాల రూపంలో రూ.2,22,670/-లు స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని ఈవో చెప్పారు.
Similar News
News February 24, 2026
శ్రీకాకుళంలో ప్రభలిన డయేరియా

శ్రీకాకుళం పట్టణంలోని మేదరవీది, గోల్కొండ రేవు రోడ్డు పరిసర ప్రాంతాలలో నివాసం ఉంటున్న పలువురు డయోరియా కారణంగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ప్రైవేటు, ప్రజా వైద్య శాలలో ఆదివారం రాత్రి నుంచి బాధితులు చికిత్స పొందుతున్నారు. సుమారు 25 మంది వరకూ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య సమస్యగా ఉందని స్థానికులు అంటున్నారు.
News February 23, 2026
SKLM: డయేరియా గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్

శ్రీకాకుళం నగర పరిధిలో ప్రబలిన ధైర్య ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ దినకర్ పుండ్కర్ సోమవారం పర్యటించారు. కాకివీధి, గుడివీధి, దమ్మలవీధి, మంగువారి తోట గ్రామాల్లో డయేరియా ప్రబలి పలువురు అస్వస్థకు గురయ్యారు. నీరు కాచి చల్లార్చి తాగాలని, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తినరాదని సూచనలు చేశారు. ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తామని 2,3 రోజులు ఇంట్లో నిలువ ఉన్న నీరు వాడకూడదన్నారు.
News February 23, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

➤పలాస:గూడ్స్ రైలుకు తప్పిన పెనుప్రమాదం
➤శ్రీకాకుళంలో ప్రబలిన డయేరియా
➤శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్ కు 51 వినతులు
➤ఇచ్ఛాపురం: ఏసీబీ వలలో ఎంఈఓ
➤జిల్లాలో పలుచోట్ల అంగన్వాడీల నిరసన
➤శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షకు 662 మంది గైర్హాజరు
➤టెక్కలి: ఆటో-బైక్ ఢీ..ఆరుగురికి గాయాలు
➤జిల్లా వ్యాప్తంగా ఎర్రన్నాయుడు జయంతి కార్యక్రమాలు


