News February 11, 2025

అరసవల్లి ఆదిత్యుని హుండీ లెక్కింపు

image

అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి హుండీల ఆదాయాన్ని మంగళవారం లెక్కించినట్లు అధికారులు తెలిపారు. నగదు రూపంలో రూ.64,39,016 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ పేర్కొన్నారు. అలాగే 17.4గ్రాముల బంగారం, 1.212కేజీ వెండి వచ్చిందని వెల్లడించారు.

Similar News

News March 28, 2025

శ్రీకాకుళం: బాలల హక్కుల కార్యదర్శి నియామకం

image

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని మురపాక గ్రామానికి చెందిన వమరవెల్లి మణి బాబును జిల్లా బాలహక్కుల పరిరక్షణ వేదిక కార్యదర్శిగా శుక్రవారం రాష్ట్ర కన్వీనర్ గురుగుబెల్లి దామోదర్ నియమించారు. ఈ సందర్భంగా మణిబాబు మాట్లాడుతూ.. బాలల హక్కుల కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. బాల కార్మికులను గుర్తించడం, పాఠశాలల్లో డ్రాప్ ఔట్‌లను తగ్గించడం తన ప్రథమ కర్తవ్యం అని అన్నారు.

News March 28, 2025

SLM: పక్షుల రక్షణకు విద్యార్థుల వినూత్న ఆలోచన

image

పక్షుల రక్షణకు విద్యార్థులు వినూత్న రీతిలో ఆలోచిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని బూరగాం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాఠశాల, గ్రామాలలో పక్షుల కోసం ప్రత్యేకంగా తొట్టెలు, కొబ్బరి చిప్పల్లో నీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఎండకు స్పృహ తప్పి పడిపోయిన పక్షికి విద్యార్థులు నీరు తాగించి రక్షించారు. దీంతో పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

News March 28, 2025

శ్రీకాకుళం నుంచి భద్రాచలానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

image

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 5వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని పలాస, టెక్కలి, శ్రీకాకుళం బస్ స్టేషన్ కాంప్లెక్స్‌ల నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ. విజయకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులు ఏప్రిల్ సాయంత్రం 5 గంటలకు శ్రీకాకుళం బస్ స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు భద్రాచలం చేరతాయని వివరించారు.

error: Content is protected !!