News February 4, 2025
అరసవల్లి: భక్తుల రాకపోకలను పరిశీలించిన కలెక్టర్

అరసవల్లిలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఉన్న సీసీ కెమెరాలు, డ్రోన్‌ల ద్వారా భక్తుల సందర్శన, రాకపోకలను శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కె.వీ.మహేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మంగళవారం పరిశీంచారు. ఇంద్రపుష్కరిణిని పరిశీలించి అక్కడ భవిష్యత్తులో చేయవలసిన ఏర్పాట్లపై చర్చించారు.
Similar News
News February 6, 2025
మంత్రి అచ్చెన్నాయుడికి 17వ ర్యాంక్

సీఎం చంద్రబాబు మంత్రులకు గురువారం ర్యాంకులు ప్రకటించారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడికి 17వ ర్యాంక్ వచ్చింది. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సీఎం మంత్రికి సూచించారు.
News February 6, 2025
SKLM: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం

ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఎస్సై సందీప్ వివరాల మేరకు.. బుధవారం అర్ధరాత్రి పట్టణంలోని చౌదరి సత్యనారాయణ కాలనీకి చెందిన తరుణ్ (19), పాజిల్ బేగ్ పేటకు చెందిన కార్తీక్ (21) బైక్‌పై వస్తూ డివైడర్‌ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
News February 6, 2025
అరసవల్లి ఆలయ ఆదాయం ఎంతంటే!

అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయానికి ఆదాయం రూ.70.39 లక్షలు వచ్చాయని ఈవో వై.భద్రాజీ తెలిపారు. గతేడాది కంటే రూ.20 లక్షలు అధికంగా వచ్చినట్లు చెప్పారు. ఈ మొత్తం టికెట్లు, క్షీరాభిషేకం, కేశఖండన ద్వారా సమకూరిందన్నారు.