News March 23, 2024

అరసవిల్లి ఆలయ ప్రాంగణంలో వృద్ధుడి మృతి

image

నరసన్నపేటలోని మారుతీనగర్‌కు చెందిన ఉదండ్రావు వెంకట భాస్కరరావు(70) భార్య కృష్ణవేణితో కలిసి శుక్రవారం అరసవల్లి ఆలయానికి వచ్చారు. సెల్‌ఫోన్ డిపాజిట్ చేసి స్వామి దర్శనానికి క్యూలైనులోకి వెళ్లగా.. గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు 108 సిబ్బందికి ఫోన్ చేశారు. ఆ వాహనం వచ్చేలోగా ఆర్ఎంపీ వైద్యుడిని పిలిచి చూపించగా.. అప్పటికే భాస్కరరావు మృతి చెందినట్లు తెలిపారు.

Similar News

News November 27, 2024

శ్రీకాకుళం జిల్లాలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో గంజాయి నిర్మూలనలో భాగంగా టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రధాన కూడళ్లలో వాహనాలను అపి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గంజాయి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.

News November 27, 2024

కర్మవీర చక్ర అవార్డు అందుకున్న శ్రీకాకుళం వాసి

image

సంతబొమ్మాలి మండలం రుంకు హనుమంతుపురం గ్రామానికి చెందిన పోలాకి జయరామ్ కర్మవీర చక్ర అవార్డును అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలలో లక్షాలది మంది విద్యార్థుల జీవితాల్లో జీవన ప్రమాణాలు అభివృద్ధి కోసం కృషి చేశారు. ఇందుకోసం కర్మవీర చక్ర అవార్డును ఢిల్లీలో నవంబర్ 26న హార్ట్ ఫర్ ఇండియా ఫౌండేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ ప్రిన్సెస్ ప్రాన్క్రోసి స్టూడిజా చేతులు మీదుగా ప్రధానం చేశారు. 

News November 27, 2024

ఎచ్చెర్ల: పీజీ కోర్సులో ఈనెల 29న స్పాట్ అడ్మిషన్

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మిగులు సీట్లకు ఈ నెల 29న స్పాట్ అడ్మిషన్ నిర్వహించినట్లు రిజిస్ట్రార్ పి.సుజాత బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు ఉదయం.10 నుంచి మధ్యాహ్నం మూడు వరకు ఈ ప్రవేశాలు జరగనున్నాయని తెలిపారు. ఏపీ పీజీ సెట్ -2024 అర్హతతో సంబంధం లేకుండా డిగ్రీ ఉత్తీర్ణత ఆధారంగా ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.