News November 30, 2024
అరసవిల్లి గుడికి రూ.100 కోట్లు ఇవ్వండి: మంత్రి
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం అరసవిల్లి సూర్యనారాయణస్వామి దేవాలయం చరిత్రను వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రసాద్ పథకం కింద అరసవిల్లి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. రూ.100 కోట్లతో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని విన్నవించారు.
Similar News
News December 9, 2024
SKLM: మంత్రి నాదెండ్లను కలిసిన జనసేన నేతలు
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను విజయనగరం జిల్లాలోని భోగాపురం రిసార్ట్‌లో సోమవారం శ్రీకాకుళం జనసేన జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి పీసీనీ చంద్రమోహన్, జిల్లా కార్యదర్శులు వడ్డాది శ్రీనువాసరావు, తాళాబత్తుల పైడిరాజు, చిట్టి భాస్కర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు.
News December 9, 2024
వీరఘట్టం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
వీరఘట్టం మండలం వండువ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరఘట్టంకు చెందిన కూర్మాన అశోక్ చక్రవర్తి (35) అనే వ్యక్తి మృతి చెందాడు. కొంతకాలంగా పాలకొండలో నివాసం ఉంటున్న అతడు ఆదివారం వీరఘట్టం వచ్చి తిరిగి పాలకొండ వెళుతుండగా మార్గ మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటనపై ఎస్సై కళాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News December 8, 2024
SKLM: రైల్వే అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష
శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులపై విశాఖపట్నంలో ఆదివారం డివిజన్ సమావేశం నిర్వహించారు. సమీక్షలో మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. అమృత భారత్‌లో భాగంగా శ్రీకాకుళం నౌపాడ స్టేషన్ల అభివృద్ధి చేయాలని, నౌపాడ -గుణుపూర్ లైన్ క్రాసింగ్ స్టేషన్ నిర్మాణం, టెక్కలి పాతపట్నం స్టేషన్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. పొందూరు – పలాస మధ్య జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు.