News September 30, 2024
అరసవెల్లి ఆలయంలో సూర్యకిరణ దర్శనం
అరసవెల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో ఉత్తరాయణ, దక్షిణాయణ కాలమార్పుల్లో భాగంగా తొలి సూర్యకిరణాలు నేరుగా మూలవిరాట్టును తాకనున్నాయి. ఆ అరుదైన క్షణాలు అక్టోబర్ 1, 2 తేదీల్లో సాక్షాత్కరించనున్నాయని EO భద్రాజీ ఆదివారం తెలిపారు. సూర్యోదయ సమయంలో నేరుగా సూర్యకిరణాలు గర్భాలయంలోని స్వామి వారి మూలవిరాట్టును తాకడం ఇక్కడి క్షేత్ర మహత్యంగా చెబుతుంటారు. భక్తులు దర్శించుకోవాలని కోరారు.
Similar News
News October 4, 2024
సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లిన శ్రీకాకుళం టీం
యూటీఎఫ్ స్వర్ణోత్సవాల్లో భాగంగా గుంటూరులో జరుగుతున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో శుక్రవారం యూటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు సెమీ ఫైనల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ట్రెజరర్ తదితరులు జిల్లా క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.
News October 4, 2024
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను పూర్తిచేయండి: మంత్రి
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను సత్వరమే పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గుత్తేదారును ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖలు ఒకే ప్రాంగణంలో ఉండేలా నూతన కలెక్టరేట్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఒక వ్యక్తి వివిధ శాఖల అధికారులను కలవాలని వస్తే అలాంటి వ్యక్తికి నూతన కలెక్టరేట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
News October 4, 2024
శ్రీకాకుళం: దసరా వేళ.. భారీగా వసూళ్లు
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా వేరే ప్రాంతాలలో ఉద్యోగాలు, పనులు చేసుకొనే వారు శ్రీకాకుళం జిల్లాలోని సొంతూళ్లకు పయనమయ్యారు. అయితే పండుగకు నెలల కిందటే రైలు, ఇతర ఆర్టీసీ బస్సు సీట్లు బుక్ అయిపోయాయి.ఇదే అదనుగా ప్రైవేటు యాజమాన్యం అధిక రేట్లు పెంచి రెచ్చిపోతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమి రూ.వేలలో చెల్లించి ఊరికి చేరుతున్నారు. దీనిపై రవాణా శాఖా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.