News March 17, 2025

అరిలోవ: జైలులో ఖైదీలకు ఫోన్‌లు అందించిన దంపతులు అరెస్ట్

image

సెంట్రల్ జైలులో ఖైదీలకు ఫోన్‌లు అందించిన కేసులో భార్యాభర్తలను అరిలోవ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఈ కారాగారంలో పని చేసిన ఫార్మాసిస్టు శ్రీనివాసరావుతో పాటు అతడి భార్య పుష్పలతను ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై కృష్ణ తెలిపారు. జైలులో ఉన్న నాగమల్లేశ్వరావు అనే ముద్దాయికి ఫోన్లు అందించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. దంపతులు శ్రీకాకుళం జిల్లా జలుమూరు పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Similar News

News September 16, 2025

దసరా అంటే విజయవాడకు వెళ్లాలనిపించేలా ఉత్సవాలు: సత్యకుమార్

image

AP: దసరా అంటే ప్రజలకు విజయవాడ వెళ్లాలనిపించేలా ‘విజయవాడ ఉత్సవ్’ నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రజాప్రతినిధులతో VJAలో నిర్వహించిన ఉత్సవాల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ‘22వ తేదీ నుంచి 11రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తాం. అంతరించిపోతున్న కళలను పరిరక్షించేలా వేడుకలుంటాయి. VJAను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ఇవి దోహదపడతాయి. మైసూర్ తరహాలో విజయవాడ ఫెస్ట్ నిర్వహిస్తాం’ అని తెలిపారు.

News September 16, 2025

రోడ్లపై పశువుల నివారణకు చర్యలు తీసుకోవాలి : కలెక్టర్

image

పెద్దపల్లి రోడ్లపై పశువుల సంచారాన్ని నియంత్రించాలని, వాటికి తప్పనిసరిగా వ్యాక్సినేషన్ అందించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. సోమవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. కుక్కలు, కోతులు, పందులు, ఆవులు రోడ్లపై తిరగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు నివారించేందుకు వాటిని సంబంధిత కేంద్రాలకు తరలించాలన్నారు. యానిమల్ బర్త్ కంట్రోల్(ఎబీసీ) చర్యలు తప్పనిసరని పేర్కొన్నారు.

News September 16, 2025

రేవంత్.. ఇంతకన్నా చేతకానితనం ఉంటుందా: కేటీఆర్

image

TG: సీఎం రేవంత్, కాంగ్రెస్ సర్కారు ఘోరతప్పిదంతో SLBC టన్నెల్ కూలిందని, ఈ ఘటనలో ఆరుగురి మృతదేహాలను బయటకు తీయలేక చేతులెత్తేశారని KTR మండిపడ్డారు. ‘హైదరాబాద్ నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి డెడ్ బాడీలను మూడు రోజులైనా గుర్తించలేరా? ఇంతకన్నా చేతకానితనం, పరిపాలనా వైఫల్యం ఇంకోటి ఉంటుందా? తమ ఆప్తులను చివరి చూపు చూసుకోలేని బాధిత కుటుంబాల ఆవేదన ప్రభుత్వానికి వినిపించడం లేదా?’ అని ప్రశ్నలు సంధించారు.