News March 30, 2025

‘అరుకు ఎంపీని ఆహ్వనించకపోవడం ఆమెను అవమానించమే’

image

అరకు కాఫీ స్టాల్‌ను పార్లమెంట్లో ఏర్పాటు చేసిన సందర్భంలో అరకు ఎంపీ తనూజరాణిని ఆహ్వానించకపోవడం ఆమెను అవమానించడమే అని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే జోగారావు అన్నారు. పార్వతీపురంలో శనివారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలోనే ఎన్డీఏ కూటమి ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిందని, ప్రతి చోటా ఇదే పరిస్థితి ఎదురవుతోందని మండిపడ్డారు.

Similar News

News December 1, 2025

చిన్న వయసులోనే టీకా ఎందుకు తీసుకోవాలంటే..?

image

గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) సంక్రమించడానికి ముందే టీకా తీసుకోవడం వల్ల అత్యధిక రక్షణ లభిస్తుంది. అందుకే, లైంగిక చర్య ప్రారంభానికి ముందే, అంటే 9 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సులో బాలికలకు టీకా ఇవ్వాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. బాలికలకే కాకుండా పురుషాంగం, పాయువు, గొంతు క్యాన్సర్ల రక్షణ కోసం బాలురు కూడా ఈ టీకా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News December 1, 2025

కేఎంటీపీలోకి అమెరికా పత్తి బేళ్లు ప్రవేశం!

image

WGL కేఎంటీపీ వస్త్ర పరిశ్రమలకు అమెరికా నుంచి పత్తి బేళ్లు దిగుమతి అవుతున్నాయి. ఇప్పటికే 13 కంటెయినర్లు రాగా, త్వరలో మరో 15 కంటెయినర్లు రానున్నాయి. ఇటీవల ప్రభుత్వం దిగుమతి సుంకం ఎత్తివేయడంతో విదేశీ బేళ్లు దేశీయ బేళ్లకంటే చౌకగా మారాయి. కైటెక్స్, యంగ్వన్ వంటి కంపెనీలు విదేశీ బేళ్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నాయి. సీసీఐ ద్వారా రాష్ట్రంలోనే సరిపడా బేళ్లు లభిస్తున్నా, విదేశాలవి రావడంపై ఆగ్రహంగా ఉన్నారు.

News December 1, 2025

భూపాలపల్లి: మొదటి రోజు అంతంత మాత్రంగానే నామినేషన్లు

image

జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు రెండో విడత నామినేషన్లు మొదటి రోజు (ఆదివారం) అంతంత మాత్రంగానే దాఖలయ్యాయి. సర్పంచ్‌లకు భూపాలపల్లిలో 3, చిట్యాలలో 20, టేకుమట్లలో 16, పలిమెలలో 3 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే వార్డులకు భూపాలపల్లిలో 1, చిట్యాలలో 19, టేకుమట్లలో 4, పలిమెలలో 4 నామినేషన్లు దాఖలయ్యాయి.