News July 14, 2024

అరుణాచలానికి ప్రత్యేక బస్సులు

image

తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలేశ్వరుని దర్శనానికి మహబూబ్ నగర్ రీజియన్‌లోని MBNR, NGKL డిపోల నుంచి 10 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం వి.శ్రీదేవి తెలిపారు. ఈ నెల 19న రాత్రి రెండు డిపోల నుంచి బస్సులు అరుణాచలానికి బయలుదేరుతాయన్నారు. MBNR ప్రాంత ప్రయాణికులు 94411 62588, MGKL ప్రాంతం వాళ్లు 83092 14790 నంబర్లలో సంప్రదించాలని, పెద్దలకు రూ.3,600, పిల్లలకు రూ.2,400 ధర నిర్ణయించామన్నారు.

Similar News

News October 16, 2025

కురుమూర్తి బ్రహ్మోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ

image

చిన్నచింతకుంట మండలం అమ్మాపురం శివారులోని శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ మేరకు శ్రీ కురుమూర్తి దేవస్థాన ఛైర్మన్ జి.గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేకు ఆహ్వన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

News October 16, 2025

పాలమూరు యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరైన గవర్నర్

image

పాలమూరు యూనివర్సిటీలో గురువారం నిర్వహించిన 4వ కాన్వకేషన్ (స్నాతకోత్సవం) కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలమూరు యూనివర్సిటీలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ జానకి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, వీసీ శ్రీనివాస్ ఉన్నారు.

News October 16, 2025

పాలమూరు బిడ్డకే గౌరవ డాక్టరేట్

image

ఉమ్మడి పాలమూరు జిల్లా నవాబుపేట(M) గురుకుంటకి చెందిన పారిశ్రామికవేత డాక్టర్ మన్నే సత్యనారాయణ రెడ్డి (MSN)కి పాలమూరు యూనివర్సిటీ మొట్టమొదటి గౌరవ డాక్టరేట్ నేడు గవర్నర్ చేతి మీదగా ప్రదానం చేయనుంది. ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు స్థాపించారు. ప్రస్తుతం ఛైర్మన్, ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ సాధించారు. #CONGRATULATIONS