News January 31, 2025
అరుదైన అనుభూతి: చదివిన పాఠశాలలోనే రిటైర్

తాను చదివిన పాఠశాలలోనే పని చేస్తూ రిటైర్ అయ్యే అవకాశం రావడం అరుదైన విషయం. అలాంటి అవకాశం అల్లూరి జిల్లా రాజవొమ్మంగి జడ్పీ ఉన్నత పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసిన కె.వరలక్ష్మికి వచ్చింది. ఆమె చదువుకున్న స్కూల్లోనే శుక్రవారం పదవీ విరమణ చేసింది. పదో తరగతి వరకు తాను ఇదే పాఠశాలలో చదువుకున్నట్లు వెల్లడించింది. పలు గ్రామాల్లో పని చేసి చివరకు తాను చదివిన పాఠశాలలోనే రిటైర్ అవ్వడం ఆనందం ఉందన్నారు.
Similar News
News November 21, 2025
నవాబుపేట: కూతురి ప్రేమ వ్యవహారంతో తండ్రి ఆత్మహత్య

నవాబుపేట మండలం హన్మసానిపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కౌల్ల ఎల్లయ్య(40) కూతురు గౌతమి ఓ యువకుడిని ప్రేమించి అతనితో వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దీంతో మనస్తాపం చెంది బుధవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. గురువారం ఉదయం తన పొలంలోని చింతచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అరుణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 21, 2025
బెంగళూరులో రూ.7కోట్ల దోపిడీ.. చిత్తూరులో కారు

బెంగళూరు జేపీ నగర్లో బుధవారం పట్టపగలే దోపిడీ చేసిన కొందరు ఏపీ వైపు వచ్చారు. అక్కడి HDFC బ్యాంకు ఏటీఎంలో నగదు జమ చేసే వాహనాన్ని కొంతమంది అడ్డుకున్నారు. రూ.7 కోట్ల నగదును నిందితులకు చెందిన ఇన్నోవా కారులోకి మార్చుకుని పారిపోయారు. చిత్తూరు(D) గుడిపాల మండలం చీలాపల్లి కూడలి పెట్రోల్ బంకు వద్ద కారు వదిలి పరారయ్యారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 21, 2025
ఏపీ సచివాలయం వద్ద భద్రత పెంపు

AP: రాష్ట్రంలో మావో అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్, మరో 51 మంది మావోయిస్టులు అరెస్టయిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెలగపూడి సచివాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే ఉద్యోగుల ఐడీ కార్డులను పరిశీలించిన తర్వాతే లోపలికి పంపుతున్నారు. విజయవాడ పరిసరాల్లో మరింత మంది మావోలు ఉండొచ్చనే సమాచారంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.


