News July 29, 2024

అర్జీదారులకు పరిష్కారం అందాలి: కలెక్టర్ శివశంకర్

image

సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వచ్చే అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారాలను చూపాలని,  జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు. నేడు కలెక్టరేట్లోని గ్రీవెన్స్ సెల్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటితో పాటు అదితి సింగ్, డిఆర్వో గంగాధర్ గౌడ్, ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మీలు హాజరయ్యారు.

Similar News

News December 2, 2025

కడప: జిల్లాలో రూ.83.38 కోట్ల మద్యం విక్రయం

image

కడప జిల్లాలో నవంబరు నెలలో రూ.83.38 కోట్ల మద్యాన్ని విక్రయించారు. 44,233 కేసులు బీర్లు, 1,24,430 కేసులు మద్యం విక్రయించారు. కడపలో రూ.22.85 కోట్లు, ప్రొద్దుటూరులో రూ.15.61 కోట్లు, మైదుకూరులో రూ.7.74 కోట్లు, సిద్దవటంలో రూ.2.43 కోట్లు, పులివెందులలో రూ.9.73 కోట్లు, ఎర్రగుంట్లలో రూ.6.62 కోట్లు, ముద్దనూరులో రూ.3.52 కోట్లు, జమ్మలమడుగులో రూ.5.74 కోట్లు, బద్వేల్‌లో రూ.9.10 కోట్లు మద్యాన్ని విక్రయించారు.

News December 1, 2025

కడప: వాయిదా పడిన డిగ్రీ పరీక్ష.. మళ్లీ ఎప్పుడంటే.!

image

దిత్వా తుఫాను కారణంగా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయ డిగ్రీ, పీజీ పరీక్షల తేదీలను విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె.ఎస్.వి. కృష్ణారావు సోమవారం ప్రకటించారు. డిసెంబర్ 1వ తేదీన డిగ్రీ వారికి జరగాల్సిన పరీక్షను ఈ నెల 6వ తేదీ ఉదయం నిర్వహిస్తున్నామన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ పీజీ విద్యార్థులకు ఈనెల 9వ తేదీ ఉదయం పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు.

News December 1, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు..
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,790
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.11,767
☛ వెండి 10 గ్రాములు ధర: రూ.1750