News November 4, 2024

అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 252 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలనుంచి వివిధ సమస్యల పరిష్కారానికి వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.

Similar News

News December 9, 2025

‘పరీక్షా పే చర్చ’.. ఉమ్మడి జిల్లాకు కోఆర్డినేటర్ల నియామకం

image

‘పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు పశ్చిమ, ఏలూరు జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమించినట్లు డైట్ ప్రిన్సిపాల్ ఎం.కమలకుమారి తెలిపారు. పశ్చిమ గోదావరికి ఎం.విజయప్రసన్న, బి.జాన్సన్‌లు, ఏలూరు జిల్లాకు వై.స్వరాజ్యశ్రీనివాస్, సీహెచ్ గోవిందరాజులు, శామ్యూల్‌ సంజీవ్‌లు ఎంపికయ్యారు. ఈనెల 11వ తేదీ వరకు జరిగే రిజిస్ట్రేషన్లను పర్యవేక్షించాలని ఆమె సూచించారు.

News December 9, 2025

ఆచంటలో ఈనెల 10 జాబ్ మేళా..!

image

ఈనెల 10న ఆచంట ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకమాన్ తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీస్ ఈ జాబ్ మేళా నిర్వహిస్తుందన్నారు. ప్రముఖ కంపెనీల్లో 200 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. 18-35 సంవత్సరాల వయసు, పదో తరగతి ఆపై చదివినవారు అర్హులన్నారు.