News February 24, 2025

అర్జీలను నాణ్యతగా పరిష్కారించండి: సబ్ కలెక్టర్

image

ఆదోని సబ్ కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు పాల్గొని ప్రజల వినతి పత్రాలను స్వీకరించారు. నిర్ణీత గడువులోపు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ఎల్‌ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు.

Similar News

News November 13, 2025

కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో విస్తృత తనిఖీలు

image

ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డీఎస్పీ జె.బాబు ప్రసాద్ నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. సీఐలు, ఎస్సై, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు. బస్టాండ్‌లో అనుమానిత వ్యక్తులు, వాహనాలు, పార్సిల్ కార్యాలయాలను పోలీసులు పరిశీలించారు.

News November 13, 2025

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ఆహ్వానం

image

కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు 2026-27కు అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా సమాచార అధికారి కె.జయమ్మ తెలిపారు. గత అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈనెల 30తో ముగుస్తుందన్నారు. కొత్త దరఖాస్తులు రేపటి నుంచి https://mediarelations.ap.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌‌లో సమర్పించాలని సూచించారు.

News November 13, 2025

మందు బాబులకు కర్నూలు ఎస్పీ హెచ్చరిక

image

కర్నూలు జిల్లాలో బహిరంగంగా మద్యం తాగి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. రోడ్లు, నడక దారులు, పార్కులు, వ్యాపార సముదాయాల వద్ద ప్రజా జీవనానికి ఆటంకం కలిగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాశాంతికి భంగం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.