News February 24, 2025

అర్జీలను నాణ్యతగా పరిష్కారించండి: సబ్ కలెక్టర్

image

ఆదోని సబ్ కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు పాల్గొని ప్రజల వినతి పత్రాలను స్వీకరించారు. నిర్ణీత గడువులోపు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ఎల్‌ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు.

Similar News

News March 19, 2025

మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించండి: కలెక్టర్

image

జిల్లాలో గంజాయి సాగు, మత్తు పదార్థాల సరఫరా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టే విధంగా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నార్కోటిక్స్ కో ఆర్డినేషన్ (NCORD) సమావేశాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి నిర్వహించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగించాలని అధికారులను ఆదేశించారు.

News March 18, 2025

ప్రమాదాలు జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

రహదారుల్లో ప్రమాదాలు జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, వాహనాలను ఓవర్ టేక్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిపై అవగాహన కల్పించాలన్నారు.

News March 18, 2025

దేవనకొండ: శ్రీ గద్దరాల మారెమ్మవ్వ చరిత్ర

image

కర్నూలు జిల్లా దేవనకొండ మండల సమీపానికి 5 కిలోమీటర్ల దూరంలో కొండల్లో వెలిసిన శ్రీ గద్దరాల మారమ్మ అవ్వ మూడేళ్లకొకసారి జరిగే ఊరు దేవురా కుంభోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. పక్కనున్న పల్లె దొడ్డి గ్రామం నుంచి 101 కుంభాలతో గద్దరాల మారెమ్మవా దేవాలయం చేరుకునే సమయంలో అమ్మవారు గద్ద రూపంలో దేవాలయం వెనకాల ఉన్న కొండపై వాలి వెళ్లిపోతుందని అక్కడి గ్రామస్థులు పురాణాలు చెబుతున్నారు.

error: Content is protected !!