News January 30, 2025
అర్జీలను వెంటనే పరిష్కరించండి: ప్రకాశం కలెక్టర్

తర్లుపాడు తహశీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం సందర్శించారు. ముందుగా కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించి, రెవెన్యూ సదస్సు, బంగారు బాల్యంపై విచారించారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
Similar News
News December 9, 2025
ప్రకాశం డీఈవో కిరణ్ కుమార్ బదిలీ

ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఈవోల సాధారణ బదిలీలలో ప్రకాశం జిల్లా డీఈవో కిరణ్ కుమార్ గుంటూరు జిల్లా బోయపాలెం డైట్ కళాశాలకు బదిలీ కాగా, ఆయన స్థానంలో గుంటూరు జిల్లా డీఈవో సీవీ రేణుక నియమితులయ్యారు. త్వరలోనే ప్రకాశం డీఈవోగా రేణుక బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.
News December 9, 2025
ప్రకాశం: టెట్ పరీక్ష రాస్తున్నారా.. ఈ రూల్స్ పాటించండి.!

ప్రకాశం జిల్లాలో రేపటి నుంచి జరిగే టెట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకై కలెక్టర్ రాజాబాబు పలు సూచనలు చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ మాట్లాడుతూ.. మొత్తం 810 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానుండగా, పరీక్ష హాలులోకి సెల్ఫోన్లకు అనుమతి లేదన్నారు. గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరాలని సూచించారు. ఉదయం 510 మంది, సాయంత్రం 300 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
News December 9, 2025
ప్రకాశం: రేపటి నుంచి టెట్ పరీక్షలు..!

ప్రకాశం జిల్లాలో ఈనెల 10 నుంచి 21 వరకు జరిగే టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో టెట్ పరీక్షల నిర్వహణపై మంగళవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మొత్తం 810 మంది అభ్యర్థులు టెట్ పరీక్షలకు హాజరుకానున్నట్లు, 8 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9:30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3.30 నుంచి 5 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.


