News January 21, 2025
అర్జీలపై అధికారులు దృష్టి పెట్టాలి: ప్రకాశం కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఆర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్‌లో మీ కోసం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో 302 అర్జీలు వచ్చాయన్నారు. వీటిని ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News February 12, 2025
సంతనూతలపాడులో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

సంతనూతలపాడు మండలంలోని ఎం.వేములపాడు గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వేను కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం పరిశీలించారు. ఎంతమంది రీ సర్వే చేస్తున్నారని కలెక్టర్ అధికారులను ప్రశ్నించగా.. 5 టీములు భూముల రీ సర్వేలో పాల్గొంటున్నాయని వారు వివరించారు. వెంటనే రైతులకు ఫోన్ చేసిన కలెక్టర్ ఒక్క టీము మాత్రమే పాల్గొందని తెలుసుకొని 4 టీముల అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించినట్లు సామాచారం.
News February 12, 2025
ఒంగోలు: బెంగళూరుకు ఈవీఎంలు తరలింపు

ఒంగోలు నగరం మామిడిపాలెంలోని గోదాములో ఉన్న గత ఎన్నికలలో పనిచేయని వి.వి.ప్యాట్లు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లను మంగళవారం బెంగళూరులోని బెల్ కంపెనీకి అధికారులు పంపించారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అధికారులు ఈ ప్రక్రియను నిర్వహించారు.
News February 12, 2025
ప్రకాశం: టెన్త్ అర్హతతో 118 ఉద్యోగాలు

మార్కాపురం డివిజన్‌లో 57, ప్రకాశం డివిజన్‌లో 61 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.