News March 25, 2025
అర్జీలపై అలసత్వం చేయొద్దు: అన్నమయ్య ఎస్పీ

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ ముఖాముఖి మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకొని, వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రులకు వేధింపులు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ-ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్ లైన్ మోసం, ప్రేమపేరుతో మోసం, ఇతర సమస్యలపై ఫిర్యాదులు అందడంతో వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
Similar News
News April 23, 2025
మాజీ ఎంపీపీ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా: ఎమ్మెల్యే పుల్లారావు

కూటమి ప్రభుత్వంలో హత్యలు, అరాచకాలకు తావులేదని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం అన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి, సంతనూతలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. వారి వెనకున్న వారు ఎవరైనా ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. కూటమి ప్రభుత్వం దోషులను గుర్తించి త్వరలోనే వారికి కఠిన శిక్ష పడేలా చేస్తుందన్నారు.
News April 23, 2025
రొంపిచర్ల: పదో తరగతి ఒకేసారి పాసైన తండ్రి, కూతురు

రొంపిచర్ల గ్రామపంచాయతీ పాలెం వీధికి చెందిన తండ్రి, కూతురు పదో తరగతి పరీక్షలు రాసి ఒకే సారి పాసైన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 1995-96 సంవత్సరంలో 10 పరీక్షలు రాసిన బి.షబ్బీర్ ఫెయిల్ అయ్యారు. అప్పట్లో ప్రమాదవశాత్తు గాయపడి దివ్యాంగుడిగా మారాడు. ఏదైనా ఉద్యోగం సాధించాలని కుమార్తెతో పాటు పదో తరగతి పరీక్షలు రాశాడు. తండ్రి బి.షబ్బీర్‌కు 319 మార్కులు, కుమార్తె బి.సమీనాకు 309 మార్కులు వచ్చాయి.
News April 23, 2025
వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు

AP: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ సీఐడీ కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. వచ్చే నెల 7 వరకు ఆయనకు రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో పోలీసులు ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. కాగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కూడా నిన్న వంశీకి ఎస్సీ, ఎస్టీ కోర్టు మే 6 వరకు రిమాండ్ పొడిగించిన విషయం తెలిసిందే.