News January 6, 2025

అర్జీలు పరిశీలించి నాణ్యతగా పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలతో పాటు రెవెన్యూ సదస్సులలో అందిన అర్జీలు కూడా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలక్టరేట్లో ఆమె ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి 183 ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతగా పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు. 

Similar News

News November 23, 2025

GNT: ఐటీసీ వద్ద కాల్వలో మృతదేహం కలకలం

image

నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐటీసీ వద్ద కాల్వలో మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. విధుల్లో ఉన్న రక్షక్ సిబ్బంది ఐటీసీ ప్రహరీగోడకు ఆనుకొని ఉన్న కాల్వలో మృతదేహాన్ని గుర్తించి స్థానికంగా ఆరా తీశారు. వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరీకి తరలించారు. గుర్తుతెలియని మృతదేహానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 23, 2025

నేడు గుంటూరులో బాబా శ‌త జ‌యంతి: కలెక్టర్

image

భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయి బాబా శ‌త‌ జ‌యంతి ఉత్స‌వాన్ని ప్రభుత్వ వేడుకగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. బాబా జ‌యంతిని రాష్ట్ర‌స్థాయి పండుగ‌గా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిందని చెప్పారు. ఈ నేప‌థ్యంలో కలెక్టర్ కార్యాలయంలో శ్రీ స‌త్య‌సాయి సేవా స‌మితి సౌజన్యంతో ఆదివారం వేడుకలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలన్నారు.