News December 3, 2024

అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం: ప.గో జిల్లా ఎస్పీ

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొని ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుంచి 11 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News January 20, 2026

పగో కలెక్టర్‌ నాగరాణికి ‘ఉత్తమ’ పురస్కారం

image

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి 2025 సంవత్సరానికి ‘ఉత్తమ ఎన్నికల విధానాల’ అవార్డుకు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాలకు వివిధ విభాగాల్లో పురస్కారాలు దక్కగా.. పగో కలెక్టర్‌కు ఈ గౌరవం లభించింది. జనవరి 25న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు.

News January 20, 2026

ప.గో: ఇంటర్ పరీక్షలపై డీఆర్వో సూచనలు

image

ఈ నెల 21 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 53 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయని, ఎక్కడా మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. విద్యుత్, రవాణా, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

News January 20, 2026

ఉండిలో జంట మృతదేహాల కలకలం

image

ఉండిలో జంట మృతదేహాల లభ్యం కావడం కలకలం రేపుతోంది. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న కొబ్బరి తోటలో సుబ్బారావు అనే వ్యక్తి మృతదేహం లభ్యం కాగా, మంగళవారం నిమ్మలపేటలో విజయ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వరుసగా రెండు మృతదేహాలు బయటపడటంతో ఇవి హత్యలా లేక ఆత్మహత్యలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు.