News March 15, 2025
అర్ధరాత్రి కాజీపేటలో పోలీస్ పహారా

ప్రజల్లో భరోసా కల్పించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అదేశాల మేరకు పోలీసులు పహారా నిర్వహించారు. నేరాల నియంత్రణలో ప్రజలకు పోలీసులు ఉన్నారనే అనే ధైర్యాన్ని కలిగించడం కోసం అర్ధరాత్రి తనిఖీలు చేశారు. ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి తన సిబ్బందితో పాటు, సాయుధ పోలీసులతో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ కాజీపేటలో పహారా కాశారు.
Similar News
News November 17, 2025
భూపాలపల్లి: ‘జిల్లాలో వైద్యసేవలు నాణ్యతగా, పారదర్శకంగా అందించాలి’

భూపాలపల్లి జిల్లాలో వైద్యసేవలు నాణ్యతగా, పారదర్శకంగా అందించడానికి ప్రతి ఆరోగ్య సంస్థ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం భూపాలపల్లిలోని ఐడీఓసీలో జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్న ఆసుపత్రులు లేదా వైద్య సదుపాయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

భూపాలపల్లి: ‘ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించాలి’

ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం మంజూరు నగర్లో భూపాలపల్లి నూతన ఇండియా బ్యాంక్ శాఖను రిబ్బన్ కట్ చేసి కలెక్టర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు ఆధునిక, సమగ్ర బ్యాంకింగ్ సేవలను అందించాలనే లక్ష్యంతో, ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఇండియా బ్యాంక్ జిల్లాలో నూతన శాఖను ప్రారంభించినట్లు తెలిపారు.