News March 31, 2025

అర్ధరాత్రి కారు వీరంగం.. ఇద్దరు స్పాట్‌డెడ్

image

రాజమండ్రి రూరల్ కొంతమూరులో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బాలాజీపేటకి చెందిన ఈర్లు నాగబాబు (44) ర్యాపిడో బైక్ టాక్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అర్ధరాత్రి బైక్ రైడ్‌లో ఉండగా మనీష్ ఫంక్షన్ హాల్ వద్ద మద్యం మత్తులో కారులో నలుగురు వేగంగా వచ్చి బైక్‌ని ఢీకొట్టారు. దీంతో నాగబాబుతో పాటు వెనక కూర్చున్న కస్టమర్ వీరబాబు(28) అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Similar News

News October 28, 2025

ఎలాంటి నష్టం లేకుండా పటిష్ఠ చర్యలు: కందుల

image

తుఫాను నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు ప్రతి శాఖ అధికారులు ప్రజలకు అండగా ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. రాజమండ్రిలోని కలెక్టర్ ఆఫీసులో తుఫాను సహాయక చర్యలపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వ హించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. జిల్లా ప్రత్యేక అధికారి కె.కన్నబాబు, కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్ పాల్గొన్నారు.

News October 28, 2025

ఎర్ర కాలువ పటిష్టతకు చర్యలు: మంత్రి కందుల

image

మొంథా తుఫాన్ ప్రభావం ధాటికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని మంత్రి కందుల దుర్గేశ్ మంగళవారం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. నిడదవోలు నియోజకవర్గంలోని ఎర్ర కాలువ ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ఎర్ర కాలువ పరివాహక గ్రామాల రైతులకు, ప్రజలకు తాజా పరిస్థితిని క్రమం తప్పకుండా వెల్లడించాలన్నారు.

News October 28, 2025

అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి: తూ.గో కలెక్టర్

image

అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని తూ.గో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. తుఫాను ప్రభావం నేపథ్యంలో జిల్లాలో పరిస్థితిపై సోమవారం క్షేత్రస్థాయి అధికారులతో ఆమె సమీక్షించారు. జిల్లాలో 9 మండలాలు, 303 గ్రామాలు తుఫాన్‌తో ప్రభావితమయ్యే అవకాశం ఉందని చెప్పారు. 12 మండల కంట్రోల్ రూములు, 184 పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.