News December 23, 2024

అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన పరిటాల శ్రీరామ్

image

బత్తలపల్లి మండలం తంబాపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఎరుకల శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో మాట్లాడారు. కార్యకర్తను విడుదల చేయించారు. కాగా జనసేన నాయకుల ఒత్తిడితోనే టీడీపీ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇబ్బంది పెట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు.

Similar News

News February 23, 2026

సజావుగా ఇంటర్ పరీక్షలు: కలెక్టర్ ఆనంద్

image

అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా, సజావుగా జరిగాయని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. నగరంలోని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ ఫర్ గర్ల్స్ కాలేజ్‌లో మొదటి సంవత్సరం పరీక్షలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాల్ ప్రాక్టీస్ లేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ, సీసీ కెమెరాలు, మెడికల్ క్యాంపు, తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆర్ఐఓ వెంకటరమణ నాయక్ వెల్లడించారు.

News February 23, 2026

అనంత: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

image

అనంతపురం జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు 64 కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సందేహాల నివృత్తి కోసం ప్రాంతీయ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ (08554-277626) ఏర్పాటు చేశామన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు పుకార్లను నమ్మవద్దని కోరారు.