News March 12, 2025
అర్ధరాత్రి రామగుండం CP ఆకస్మిక తనిఖీలు

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అర్ధరాత్రి రైల్వే స్టేషన్, గోదావరిఖని బస్టాండ్, రామగుండం పోలీస్ స్టేషన్, పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. CPగా బాధ్యతలు ఆయన పరిస్థితులు ఎలా ఉంటుందని, పోలీసుల పెట్రోలింగ్, గస్తీ పరిస్థితి ఏ విధంగా ఉందని ప్రత్యక్షంగా పరిశీలించారు.
Similar News
News February 25, 2026
ప్రియురాలితో బిగ్‌బాస్ నటుడి ఎంగేజ్‌మెంట్

యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రేయసి వైష్ణవిని పరిచయం చేసిన అతడు ఇవాళ ఆమెకు రింగ్ తొడిగారు. ఈ ఫొటోలను SMలో షేర్ చేశారు. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు, ఫ్యాన్స్ ఈ జంటకు విషెస్ చెబుతున్నారు. కాగా బిగ్‌బాస్-5లో షణ్ముఖ్ రన్నరప్‌గా నిలిచారు.
News February 25, 2026
సిద్దిపేట: న్యూసెన్స్ చేసిన వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష

బహిరంగ ప్రదేశంలో న్యూసెన్స్ చేసిన వ్యక్తికి సిద్దిపేట కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష విధించింది. ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామానికి చెందిన శంకర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రజలకు అసౌకర్యం కలిగించాడు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ, అసభ్య పదజాలంతో దూషించడంతో కేసు నమోదు చేశారు. ఈ మేరకు కోర్టు నిందితుడికి జైలు శిక్ష విధించింది.
News February 25, 2026
రేపు కోదాడకు కేటీఆర్ రాక!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం కోదాడకు వస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు. ఇటీవల పోలీస్ లాకప్ డెత్‌లో మృతి చెందిన కర్ల రాజేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన రానున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు.


