News April 12, 2025
అర్ధరాత్రి వరకు కొండగట్టులో పర్యటించిన కలెక్టర్

హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా కొండగట్టు దేవస్థానంలో శుక్రవారం అర్ధరాత్రి వరకు కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటించి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. అర్ధరాత్రి వరకు కొండగట్టులో ఉండి ఆలయ పరిసరాల్లో భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర సేవలను సమీక్షించారు. అత్యవసర పరిస్థితులలో తక్షణ స్పందన కోసం అన్ని విభాగాల యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. వసతుల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News December 10, 2025
సిరిసిల్ల: రేపే తొలి విడత ఎన్నికల పోలింగ్

జిల్లాలో తొలి విడత ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐదు మండలాల్లో 85 సర్పంచ్, 758 వార్డు స్థానాలకు గాను 9 సర్పంచ్, 229 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 76 సర్పంచ్, 519 వార్డు సభ్యుల స్థానాలకు గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.
News December 10, 2025
విశాఖ: కార్పొరేటర్ను మెట్ల పైనుంచి తోసేయడంతో తీవ్ర గాయాలు

వైసీపీ 58వ డివిజన్ కార్పొరేటర్ గులివిందల లావణ్య, ఆమె తండ్రి కృష్ణను మెట్ల పైనుంచి తోసేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. మిందిలోని YCP ఆఫీసులో వైసీపీ నాయకులు వంగ శ్రీను, చిన్న సత్యనారాయణరెడ్డి వారిని మెట్లపై నుంచి తోసి చంపాలని యత్నించారని కృష్ణ కుమారుడు వినోద్ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. పాత కక్షలే ఘటనకు కారణమని తెలుస్తోంది. తీవ్ర గాయాలైన లావణ్య, కృష్ణ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
News December 10, 2025
ఓటు వజ్రాయుధం, అమ్ముకోవద్దు: ఎస్పీ నరసింహ

రేపు మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లు ఎస్పీ నరసింహ సందేశమిచ్చారు. “మీ ఓటు రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం. దానిని ఆదర్శంగా, సజావుగా సద్వినియోగం చేసుకోండి, ఓటు అమ్ముకోవద్దు” అని సూచించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఓటరు బాధ్యతగా వ్యవహరించి, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.


