News March 19, 2025
అర్హత గల వారికి రుణాలు మంజూరు చేయాలి: కలెక్టర్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వివిధ అంశాల్లో లక్ష్యానికి అనుగుణంగా అర్హత గల వారికి రుణాలు మంజూరు చేయాలని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో వివిధ బ్యాంకు అధికారులు, మేనేజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా ప్రాధాన్యత రంగాల్లో రుణాలను పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం నాబార్డ్ సిద్ధం చేసిన ప్లాన్ను ఆయన ఆవిష్కరించారు.
Similar News
News December 9, 2025
తప్పిపోయిన అవ్వను గుర్తించిన మనమడు.. ఎలాగంటే?

అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న 75 ఏళ్ల వృద్ధురాలు(ముంబై) ఇంటి నుంచి బయటకెళ్లి తప్పిపోయారు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందగా ఆమె మనమడు మాత్రం తన ఆలోచనకు పదును పెట్టాడు. వృద్ధురాలు తాజుద్దీన్ ధరించిన నక్లెస్లో ఉన్న GPSతో ఆమె ఉన్న చోటును ట్రాక్ చేశాడు. బైక్ ఢీకొట్టడం వల్ల ఆస్పత్రిపాలైనట్లు తెలుసుకొని ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చాడు. అలా సాంకేతికత ఆమెను తిరిగి కుటుంబానికి దగ్గర చేసింది.
News December 9, 2025
టెట్ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలి: రెవెన్యూ అధికారి

జిల్లాలోని 5 పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 10 నుంచి ఏపీ టెట్ పరీక్షలు సజావుగా సమర్థవంతంగా నిర్వహించుటకు సిద్ధంగా ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో టెట్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలులో ఉండేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు.
News December 9, 2025
క్రీడాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా: మంత్రి

జిల్లాలో క్రీడాభివృద్ధితో పాటు క్రీడాకారుల సంక్షేమానికి నిరంతరం టీజీవీ సంస్థలు కృషి చేస్తాయని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఇటీవల దక్షిణ భారత స్థాయి సిలంబం పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను కర్నూలులోని తన నివాసంలో ఆయన మంగళవారం ఘనంగా సత్కరించారు. జిల్లా కార్యదర్శి మహావీర్ మాట్లాడుతూ.. దక్షిణ భారత స్థాయిలో జిల్లా క్రీడాకారులు అనేక పతకాలు సాధించారన్నారు.


