News March 19, 2025
అర్హత గల వారికి రుణాలు మంజూరు చేయాలి: కలెక్టర్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వివిధ అంశాల్లో లక్ష్యానికి అనుగుణంగా అర్హత గల వారికి రుణాలు మంజూరు చేయాలని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో వివిధ బ్యాంకు అధికారులు, మేనేజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా ప్రాధాన్యత రంగాల్లో రుణాలను పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం నాబార్డ్ సిద్ధం చేసిన ప్లాన్‌ను ఆయన ఆవిష్కరించారు.
Similar News
News April 17, 2025
పాడేరు: ‘తాగునీటి సమస్యలు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు’

ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అల్లూరి జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యలు గురించి కలెక్టర్ దినేష్ కుమార్ వివరించారు. జేసీ అభిషేక్ పాల్గొన్నారు.
News April 17, 2025
బాపట్ల: ఆర్డీఓ కార్యాలయంలో స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాధ్రపై సమీక్ష

బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య గురువారం ఆర్డీఓ కార్యాలయంలో స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాధ్ర కార్యక్రమం పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి నెలలో జరిగే ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఆర్డీఓ చంద్రశేఖర నాయుడు, డిఎస్‌పీ మోయిన్, తహశీల్దార్ గోపి పాల్గొన్నారు.
News April 17, 2025
BREAKING: డీఎస్సీకి వయోపరిమితి పెంపు

AP: రాష్ట్రంలో డీఎస్సీ-2025కి వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గరిష్ఠ వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది. కటాఫ్ తేదీని 2024 జులై 1గా నిర్ధారించింది. ఈ డీఎస్సీకి మాత్రమే వయోపరిమితి పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.