News March 26, 2024
అర్హులందరికీ… ఉచిత విద్యుత్ దక్కేనా..?
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ‘గృహజ్యోతి’కి అర్హులైన వేలాది మందికి ప్రస్తుతం జీరో బిల్లులు రావడం లేదు. ఇలాంటి వారంతా స్థానిక పురపాలక, ఎంపీడీఓ కార్యాలయాల్లో ఆధార్, రేషన్, విద్యుత్తు బిల్లుకు సంబంధించి పత్రాలు అందజేస్తే పథకం వర్తింపజేస్తామని అధికారులు వెల్లడించారు. భద్రాద్రి జిల్లాలో 4,942, ఖమ్మం జిల్లాలో 3,568 మంది పథకానికి నోచుకోవడం లేదని తెలుస్తోంది.
Similar News
News November 17, 2024
కలెక్టర్‌ను తనిఖీ చేసిన పోలీసులు
కొత్తగూడెంలోని సింగరేణి మహిళా డిగ్రీ కాలేజ్, సుజాతనగర్ మండలంలోని వేపలగడ్డ అబ్దుల్ కలాం ఇంజినీరింగ్ కళాశాలో గ్రూప్-3 పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పరిశీలించారు. అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది కలెక్టర్‌ను సైతం తనిఖీలు నిర్వహించి లోపలకి అనుమతించారు. పరీక్షలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులను కలెక్టర్ అభినందించారు.
News November 17, 2024
ఖమ్మం: విద్యార్థికి గుండు కొట్టించిన Asst ప్రొఫెసర్
ఖమ్మం మెడికల్ కాలేజీలో ఓ విద్యార్థికి Asst ప్రొఫెసర్ గుండు కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 12న ములుగు జిల్లాకు చెందిన ఫస్ట్ ఇయర్ విద్యార్థి చైనీస్ స్టైల్‌లో కటింగ్ చేయించుకున్నాడు. దీంతో అతడి హెయిర్ స్టైల్ చూసి సీనియర్ విద్యార్థులు హేళన చేశారు. విషయం తెలుసుకున్న యాంటీ ర్యాగింగ్ మెడికల్ ఆఫీసర్‌గా ఉన్న ఓ Asst ప్రొఫెసర్ అతడిని కటింగ్ షాప్‌కు తీసుకెళ్లి గుండు కొట్టించాడు.
News November 17, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు
> చింతకాని మండలం నాగులవంచలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి పర్యటన > ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు > బోనకల్‌లో సీపీఎం పార్టీ మండల ముఖ్య నాయకుల సమావేశం > బయ్యారంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన > వైరాలో ఉచిత వైద్య శిబిరం> > హెల్త్ మాజీ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు రాక> టేకులపల్లి > టేకులపల్లిలో మండల మహాసభ> భద్రాచలం రామాలయంలో పూజలు