News January 23, 2025
అర్హులందరికీ సంక్షేమ పథకాలు: ASF కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నాలుగు పథకాల జారీలో జిల్లాలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే పునరుద్ఘాటించారు. ప్రజల దగ్గర నుంచి సంక్షేమ పథకాలపై అభిప్రాయ సేకరణ సర్వేకు సంబంధించి ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం కొఠారి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీపీఓ భిక్షపతి, ఎంపీడీవో అంజాద్ పాషా పాల్గొన్నారు.
Similar News
News October 20, 2025
నెతన్యాహు వస్తే అరెస్ట్ చేస్తాం: కెనడా ప్రధాని

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) జారీ చేసిన అరెస్ట్ వారెంట్ను తమ దేశంలో అమలు చేస్తామని కెనడా పీఎం మార్క్ కార్నీ ప్రకటించారు. నెతన్యాహు తమ దేశంలో అడుగుపెడితే అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. బ్లూమ్బర్గ్ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాపై యుద్ధ నేరాలకు గాను 2024 నవంబర్ 21న నెతన్యాహుపై ICC అరెస్ట్ <<14671651>>వారెంట్ జారీ <<>>చేసిన విషయం తెలిసిందే.
News October 20, 2025
పండుగ పూట విషాదం.. అయిజ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అయిజ-గద్వాల రోడ్డులో బింగిదొడ్డి సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిజ మాలపేటకు చెందిన వీరేష్ మృతి చెందాడు. బైక్పై వెళ్తున్న వీరేష్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్గా పనిచేసే వీరేష్ మృతితో అయిజలో పండుగపూట విషాదం నెలకొంది.
News October 20, 2025
దీపావళి వేడుకల్లో సీఎం దంపతులు

AP: సీఎం చంద్రబాబు దంపతులు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో సతీమణి భువనేశ్వరితో కలిసి ఇంట్లో పూజ నిర్వహించారు. అనంతరం వారిద్దరూ కలిసి బాణసంచా కాల్చారు. దీపావళి వెలుగులు శాశ్వతం అవ్వాలని.. ప్రజలకు ప్రతిరోజు పండుగ కావాలని దేవుడిని ప్రార్థించానని చంద్రబాబు ట్వీట్ చేశారు.