News January 24, 2025
అర్హులందరికీ సంక్షేమ పథకాలు: ADB కలెక్టర్

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతాయని, లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ రాజార్షిషా అన్నారు. బజార్హత్నూర్ మండలం జాతర్లలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో గురువారం కలెక్టర్ పాల్గొన్నారు. లబ్ధిదారులు అందిస్తున్న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. మండల ప్రత్యేక అధికారి మోహన్ సింగ్, తహశీల్దార్ శంకర్, మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ సౌద్ తదితరులున్నారు.
Similar News
News November 25, 2025
ADB: 2వ బెటాలియన్ కమాండెంట్‌గా వెంకట్రాములు

ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడలోని 2వ బెటాలియన్ కమాండెంట్‌గా వెంకట్రాములు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు సీనియర్ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. దళాల శిక్షణ, క్రమశిక్షణ, ప్రజా బాధ్యతపై మొదటి ప్రధాన్యత ఉంటుందన్నారు. బెటాలియన్ ప్రతిష్టను మరింతగా పెంచేలా సమష్టిగా పనిచేస్తామని ఆయన అన్నారు.
News November 25, 2025
ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి సూచన

సోయాబీన్, మొక్కజొన్న, జొన్న, పత్తి పంట అవశేషాల దహనం వల్ల గాలి కాలుష్యం, భూసార, జీవవైవిధ్య నష్టం, భూమిలోని ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు నశించడం వంటి సమస్యలు ఏర్పడతాయని DAO శ్రీధర్ తెలిపారు. రైతులు వ్యవసాయ వ్యర్థాలను లేదా పంట అవశేషాలను కాల్చకుండా వాటిని కంపోస్ట్, వర్మీ కంపోస్ట్‌గా మార్చి లేదా భూమిలో కలియదున్నాలని, వ్యవసాయంలో సేంద్రియ ఎరువులుగా వినియోగించుకోవాలన్నారు. భూసారాన్ని సంరక్షించాలని అన్నారు
News November 25, 2025
ADB: ఏటీఎంలో చోరీకి యత్నించిన దొంగ అరెస్టు

ఆదిలాబాద్ కోర్టు ముందు ఉన్న ఎస్బీఐకి చెందిన రెండు ఏటీఎంలను ఒక వ్యక్తి ధ్వంసం చేసి చోరీకి యత్నించిన ఘటన చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ నాగరాజు వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి రాడ్‌తో ఏటీఎంలను ధ్వంసం చేశాడు. అలారం మోగగా పోలీసులు వెంటనే అప్రమత్తమై అక్కడకు చేరుకున్నారు. ఆగంతకుడు పారిపోగా పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి ఏపీ ప్రకాశం జిల్లా చెందిన చాట్ల ప్రవీణ్ చోరీకి యత్నించినట్లు గుర్తించి అరెస్టు చేశారు.


