News April 3, 2025
అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలి: నిర్మల్ కలెక్టర్

రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులందరూ దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాజీవ్ యువ వికాసం పథకంపై సంబంధిత అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారు వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News April 11, 2025
టీవీల్లోకి బ్లాక్ బస్టర్ సినిమా

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్కు సిద్ధమైంది. ఈనెల 13, 14 తేదీల్లో దక్షిణాది భాషల్లో ప్రసారం కానుంది. ఈనెల 13న తెలుగులో స్టార్ మా (5.30pm), మలయాళంలో ఆసియా నెట్ (6.30pm), కన్నడలో కలర్స్ కన్నడ (7pm), 14న తమిళంలో స్టార్ విజయ్ (3pm) టీవీ ఛానల్లో రానుంది. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1800కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే.
News April 11, 2025
ADB: లింగ నిర్ధారణ పరీక్షలు నేరం: DMHO

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ పేర్కొన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో భాగంగా ప్రత్యేక తనిఖీ బృందం ADBలోని రెండు స్కానింగ్ సెంటర్లను శుక్రవారం తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చారు. తనిఖీ బృందం సభ్యులు డిప్యూటీ డీఎంహెచ్ఓ సాధన, డాక్టర్ క్రాంతి, యశోద, వైష్ణవి ఉన్నారు.
News April 11, 2025
గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యం కుదింపు

TG: యాదాద్రి(D) గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యాన్ని 4.28 TMCల నుంచి 1.41 TMCలకు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.575.56 కోట్లతో అనుమతులు మంజూరు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా అప్పటి BRS ప్రభుత్వం గంధమల్ల వద్ద 9.86 TMCలతో రిజర్వాయర్ నిర్మించాలనుకుంది. ముంపునకు గురయ్యే 5 గ్రామాల నుంచి వ్యతిరేకత రావడంతో 4.28 TMCలకు కుదించింది. తాజాగా INC సర్కార్ 1.41 TMCలకు పరిమితం చేసింది.