News April 4, 2025
అర్హులకు లోన్లు అందేలా చర్యలు తీసుకోండి: కలెక్టర్

ఏలూరు జిల్లాలో స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వెనుకబడిన తరగతుల యువతకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓలతో గురువారం ఏలూరు కలెక్టరేట్ నుంచి సమీక్షించారు. బ్యాంకుల ద్వారా రుణ మంజూరుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. రుణాల మంజూరులో ఆటంకాలు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు.
Similar News
News December 6, 2025
VJA: దసరా ఉత్సవాల విజయవంతంపై పుస్తకావిష్కరణ

దసరా ఉత్సవాలను సాంకేతికతను వినియోగించుకుంటూ, అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిశ తెలిపారు. భక్తుల సంఖ్యను అంచనా వేసి ఇబ్బందులను అధిగమించామని పేర్కొన్నారు. పోలీసులు నిబద్ధతతో పనిచేశారని సీపీ రాజశేఖర్ బాబు చెప్పారు. దసరా లోపాలను సవరించి, భవానీ దీక్షల విరమణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
News December 6, 2025
సంగారెడ్డి: సదరం క్యాంపు షెడ్యూల్ విడుదల

సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో డిసెంబర్ 18, 23న సదరం క్యాంపును నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి వసంతరావు శనివారం తెలిపారు. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు, రెన్యువల్ చేయించుకునేవారు తప్పనిసరిగా యూఐడీఏఐ పోర్టల్ నందు ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. స్లాట్ బుక్ చేసుకున్న వారికి ఫోన్ కాల్ లేదా మెసేజ్ ద్వారా సమాచారం అందిన తర్వాతే వారు సంబంధిత మెడికల్ రిపోర్ట్స్‌తో హాజరుకావాలన్నారు.
News December 6, 2025
సెల్యూట్ డాక్టర్.. 1.2లక్షల మందికి ఉచితంగా..!

నిస్సహాయులకు వైద్యం అందని చోట డాక్టర్ సునీల్ కుమార్ హెబ్బీ ఆశాదీపంగా మారారు. పేరు కోసం కాకుండా సేవ చేయడానికి తన కారును ‘సంచార క్లినిక్’గా మార్చుకున్నారు. బెంగళూరు వీధుల్లోని పేదలకు ఇంటి వద్దే ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. ఒక రోడ్డు ప్రమాదంతో మొదలైన ఈ గొప్ప ప్రయాణం ఇప్పటికే 1.2 లక్షల మందికిపైగా ప్రాణాలను కాపాడింది. వైద్య పరికరాలతో నిండిన ఆయన కారు ఎంతో మందికి కొత్త జీవితాన్నిస్తోంది.


