News January 27, 2025
అర్హులకు 4 పథకాలను అందజేస్తాం: ASF కలెక్టర్

అర్హులందరికీ 4 ప్రభుత్వ పథకాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ఆదివారం వాంకిడి మండలం జైత్పూర్ గ్రామంలో రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో పథకాలపై గ్రామసభలు నిర్వహించినట్లు చెప్పారు.
Similar News
News February 13, 2025
కాలువలో మృతదేహం.. నంద్యాల వాసిగా గుర్తింపు!

బనగానపల్లె మండలం ఐ.కొత్తపేట గ్రామ సమీపంలోని ఎస్ఆర్బీసీ కాలువలో మృతదేహం లభ్యమైంది. మృతుడు నంద్యాల పట్టణ వాసిగా గుర్తించినట్లు బనగానపల్లె పోలీసులు వెల్లడించారు. ఆధారాలను బట్టి నంద్యాలలో ఫ్రూట్ జ్యూస్ వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగించే షేక్ జాకీర్ బాషా(43)గా గుర్తించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
News February 13, 2025
బాపట్ల: అప్పుల బాధతో వ్యాపారి ఆత్మహత్య

సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు ఎన్ఎస్పీ కాలువ వద్ద అప్పుల బాధతో విత్తనాల వ్యాపారి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. మృతుడు పసుమర్తిపాలెంకు చెందిన సుబ్బారెడ్డిగా సంతమాగులూరు పోలీసులు గుర్తించారు. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
News February 13, 2025
పాలమూరుకు నిధులు ఇవ్వండి: BJP ఎంపీ

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ బుధవారం భేటీ అయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అలంపూర్ 5వ శక్తి పీఠం జోగులాంబ టెంపుల్‌తో పాటు కురుమూర్తి, మన్యంకొండ, మల్దకల్ తిమ్మప్ప దేవాలయాల అభివృద్ధికి ప్రసాద్ స్కీం కింద నిధులు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. ప్రతిపాదనలపై గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారని ఎంపీ పేర్కొన్నారు.