News September 18, 2024
అర్హులైన ప్రతి కుటుంబానికీ ఇల్లు మంజూరు: కలెక్టర్

అర్హులైన ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తుందని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన- 2.0 పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలో విడుదల చేశారు. ఒంగోలులోని ప్రకాశం భవనం నుంచి కలెక్టర్, లబ్ధిదారులు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల మంజురు పత్రాలను కలెక్టర్ అందజేశారు.
Similar News
News October 15, 2025
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం అంటే జాగ్రత్త.!

డబ్బులు రెట్టింపు చేస్తామంటూ మిమ్మల్ని సైబర్ నేరగాళ్లు మోసగించే అవకాశాలు ఎక్కువ అంటూ హెచ్చరిస్తున్నారు ప్రకాశం జిల్లా పోలీసులు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఐటీ విభాగం పోలీసులు సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే మంగళవారం ఓ ప్రకటనను పోలీసులు విడుదల చేశారు. తక్కువ పెట్టుబడితో రెట్టింపు లాభాలు వస్తాయని వచ్చే మెసేజ్లపట్ల ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు.
News October 14, 2025
SNపాడులో 17న జాబ్ మేళా..!

SNపాడులోని DMSVK మహిళా కళాశాలలో ఈనెల 17వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి రవితేజలు తెలిపారు. ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ను మంగళవారం కలెక్టర్ రాజాబాబు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. 18 నుంచి 35ఏళ్ల వయసు గల నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. ప్రముఖ కంపెనీలు హాజరుకానున్నట్లు తెలిపారు.
News October 14, 2025
గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి: కలెక్టర్

ఒంగోలు పాత ZPHS సమావేశ మందిరంలో ఒంగోలు డివిజన్ పంచాయతీ కార్యదర్శులతో భౌతిక సమీక్షా సమావేశాన్ని డీపీఓ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ రాజబాబు, హాజరై పంచాయతీ కార్యదర్శులకు పారిశుద్ధ్య చర్యలపై దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, పారిశుద్ధ్యంలో ప్రకాశం జిల్లాను ముందంజలో ఉంచాలన్నారు.