News January 22, 2025

అర్హుల ఎంపికకే గ్రామసభలు: MRO జయరాం.!

image

అర్హుల ఎంపికకే గ్రామసభలు నిర్వహింస్తున్నామని MRO జయరాం అన్నారు. నవాబ్‌పేట్ మండలంలోని మీనేపల్లికలాన్, ముబారక్‌పూర్ గ్రామాలల్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో MRO పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ నెల 24 వరకు గ్రామసభలు నిర్వహిస్తామన్నారు. అర్హత ఉండి జాబితాలోలేని వారి గురించి ఇక్కడ ఏర్పాటు చేసిన కౌంటర్​లో మళ్లీ దరఖాస్తులను స్వీకరించి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి తుది జాబితాను రూపొందిస్తామన్నారు.

Similar News

News February 15, 2025

HYD: 17న KCRపై స్పెషల్ సీడీ: తలసాని

image

ఈనెల 17న బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర కార్యాలయంలో కేక్‌కట్ చేసిన అనంతరం కేసీఆర్ జీవిత విశేషాలతో ప్రత్యేక సీడీ విడుదల చేస్తామన్నారు.

News February 15, 2025

రంగారెడ్డి: అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం

image

రంగారెడ్డి కలెక్టరేట్లో తాగునీటి సరఫరాపై ఆ శాఖ అధికారులతో కలెక్టర్ నారాయణ రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో నీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

News February 15, 2025

HYD: అవినీతికి పాల్పడితే కాల్ చేయండి: ACB

image

గచ్చిబౌలి ఏడీఈ సతీష్ లంచం తీసుకుంటూ ఇటీవల ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడితే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని సూచించారు. లేదా వాట్సప్ నంబర్ 9440446106కు సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

error: Content is protected !!