News April 8, 2025
అలంపూర్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

అలంపూర్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమైంది. స్థానికుల కథనం మేరకు.. అలంపూర్ మున్సిపాలిటీ సమీపంలో ఉన్న తుంగభద్ర నది వంతెన కింద గుర్తుతెలియని వ్యక్తి మృతి దేహం పడి ఉంది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడికి సంబంధించిన వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు.
Similar News
News April 19, 2025
నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలి: మంత్రి

సన్న బియ్యం సరఫరా, ధాన్యం కొనుగోలుపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ఉత్తమ్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్తో కలిసి కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు.
News April 19, 2025
KU డిగ్రీ పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి జరగనున్న డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు KU అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు తమ విద్యార్థుల పరీక్ష ఫీజును చెల్లించలేదని, ఈ నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. II, IV, VI (రెగ్యులర్) & I, III.V సెమిస్టర్ల (బ్యాక్లాగ్) పరీక్షలు వాయిదా వేశామని చెప్పారు. పరీక్షలు నిర్వహించే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.
News April 19, 2025
CBN బర్త్ డే.. CDP రిలీజ్ చేసిన మంత్రి లోకేశ్

రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్ కామన్ డీపీని విడుదల చేశారు. ఫొటోలో పోలవరం ప్రాజెక్టు, ఏపీ సచివాలయం, ఎంఎంటీఎస్ రైళ్లు, సైబర్ టవర్స్, కియా ఫ్యాక్టరీ, అన్న క్యాంటిన్, బుద్ధ వనాలను చూపించారు. అలాగే ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి మల్టీనేషనల్ కంపెనీలను ఆకర్షించడంలో చంద్రబాబు కీలకం అని తెలిపేలా CDPని రూపొందించారు.