News March 19, 2025
అలంపూర్‌లో విషాదం.. వ్యక్తి ఆత్మహత్య

ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ వేధింపులు తట్టుకోలేక గత 20 రోజుల క్రితం నిప్పంటించుకున్న వ్యక్తి కర్నూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అలంపూర్ మండలం క్యాతూరు గ్రామానికి చెందిన నర్సింహులు ఆత్మహత్యకు యత్నించి సోమవారం రాత్రి మృతిచెందినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. ఓ ఫైనాన్స్ కంపెనీ వారు అతడిని వేధించారని, దీంతో ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్థులు తెలిపారు. కంపెనీపై చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News October 22, 2025
గాయిటర్ చికిత్స

థైరాయిడ్ గ్రంథి అయోడిన్‌ను గ్రహించి దాన్ని థైరాయిడ్ హార్మోన్లుగా మారుస్తుంది. అయోడిన్ లోపిస్తే గాయిటర్ జబ్బు వస్తుంది. థైరాయిడ్ సమస్య నిర్ధారణ కోసం చేసే పరీక్షల ఫలితాల ఆధారంగా గాయిటర్ చికిత్సకు ఎండోక్రైనాలజిస్ట్ ఆధ్వర్యంలో తగిన చికిత్స చేస్తారు. థైరాయిడ్ వ్యవస్థను సరిచేయడం ద్వారా కొంతమందిలో గాయిటర్ తగ్గుముఖం పడుతుంది. సాధారణంగా దీన్ని ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే నయం చేయవచ్చు.
News October 22, 2025
గోదావరి తీర ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

రాగల 24 గంటల్లో వర్షాల నేపథ్యంలో గోదావరి నదీ తీర మండలాలు, లోతట్టు గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తీర ప్రాంతాలు, నదీ పరివాహక మండలాల్లోని తక్కువ ఎత్తులో ఉన్న గ్రామాలలో ముందస్తు జాగ్రత్త చర్యలు, అవసరమైతే తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
News October 22, 2025
ANU: ఫార్మా డీ, M.Ed రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ నెలలో జరిగిన ఫార్మా డీ, M.Ed రీవాల్యుయేషన్ ఫలితాలను బుధవారం వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. ఫార్మా డీ 2,3,4,5 సంవత్సరాల పరీక్షల ఫలితాలు, అదేవిధంగా M.Ed ఫోర్త్ సెమిస్టర్ రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్‌ను సంప్రదించాలన్నారు.