News March 3, 2025

అలంపూర్‌లో 39.0°C డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

image

గద్వాల జిల్లాలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. సాధారణం కంటే గరిష్ఠంగా ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. మార్చి నెల ఆరంభంలోనే సాధారణం కంటే 2, 3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రానున్న 3 నెలల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. గత 24 గంటల్లో అలంపూర్‌లో 39.0°C, మల్దకల్‌లో 38.3°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News October 21, 2025

సుప్రీం ఆదేశాలు పట్టించుకోవట్లేదు: రాజ్‌దీప్

image

ఢిల్లీలో దీపావళి రోజున రాత్రి 8-10 గంటల మధ్య బాణసంచా కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే 11pm దాటినా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోకుండా టపాసులు కాలుస్తున్నారని ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్వీట్ చేశారు. SC ఆదేశాలను అమలు చేయడంలో వైఫల్యానికి ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. సుప్రీంకోర్టు కూడా వాస్తవాన్ని పరిశీలించాలని కోరారు.

News October 21, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 21, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.58 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.11 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.13 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.50 గంటలకు
✒ ఇష: రాత్రి 7.03 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 21, 2025

విశాఖ 572 మంది ఆర్టీసీ సిబ్బందికి ప్రమోషన్లు

image

విశాఖపట్నం ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందికి ప్రమోషన్లు మంజూరు కానున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 572 మందికి వివిధ కేటగిరీల్లో ప్రమోషన్లు సిద్ధం చేసినట్లు రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు 27, మెకానికల్ సూపర్వైజర్లు 113, ఏడీసీలు 115, కండక్టర్లు గ్రేడ్-1 130, డ్రైవర్లు గ్రేడ్-1 167 మంది ఉన్నారు.