News April 8, 2025
అలంపూర్: ‘అభివృద్ధికి నోచుకోని తెలంగాణ టూరిజం హోటల్’

అలంపూర్ పట్టణంలోనీ ప్రధాన కూడలిలో ఉన్న తెలంగాణ టూరిజం హోటల్ ప్రస్తుతం భోజనాలు లేక ఆలయాలకు వచ్చే సందర్శకులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో వసతి రూములతో పాటు క్యాంటీన్ ఉండడంతో భక్తులకు భోజనాలకు ఇబ్బంది ఉండేది కాదు. ఈ హోటల్కి వచ్చే సందర్శకులు ఏసీ రూములు మాత్రమే ఉన్నాయి. టూరిజం హోటల్ను అభివృద్ధి చేసి క్యాంటీన్, నాన్ ఏసీ రూములను ఏర్పాటు చేస్తే ఉపయోగపడుతుందని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News December 2, 2025
నేడు, రేపు, ఎల్లుండి.. నాన్ వెజ్ వద్దు: పండితులు

నేటి నుంచి వరుసగా మూడ్రోజుల పాటు మద్యమాంసాలు మానుకోవడం ఉత్తమమని పండితులు సూచిస్తున్నారు. ‘నేడు శివపార్వతుల ఆరాధనకు పవిత్రమైన ప్రదోషం ఉంది. రేపు సకల కార్యసిద్ధిని కలిగించే హనుమద్వ్రతాన్ని ఆచరిస్తారు. ఎల్లుండి పౌర్ణమి తిథి. దత్త జయంతి పర్వదినం. ఈ 3 రోజులు పూజలు, వ్రతాలకు విశిష్టమైనవి. కాబట్టి ఈ శుభ దినాలలో మద్యమాంసాలను మానేస్తే.. ఆయా వ్రతాల అనుగ్రహాన్ని పూర్తిస్థాయిలో పొందవచ్చు’ అని అంటున్నారు.
News December 2, 2025
MHBD: IELTSకు దరఖాస్తుల ఆహ్వానం: శ్రీనివాస్ రావు

ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (IELTS)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు MHBD జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి బి.శ్రీనివాస రావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడం, అంతర్జాతీయ స్కాలర్షిప్ పొందడం లక్ష్యంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు www.tgbcstudycircle.cgg.gov.in దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News December 2, 2025
ముగ్గురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ

విధులలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు, డిప్యూటీ MPDOకు జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. PGRS గ్రీవెన్స్లో నిర్ణీత గడువులోగా అర్జీలను చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. చిన్న పోలమాడ పంచాయతీ కార్యదర్శి బలరామమూర్తి, హవళిగి పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, ఉరవకొండ డిప్యూటీ MPDO సతీశ్ కుమార్కు నోటీసులు ఇచ్చామన్నారు.


